పేదపిల్లల పాలిట అతనొక వరం ..! సాయం చెయ్యడమే అతనికున్న నైజం...! - MicTv.in - Telugu News
mictv telugu

పేదపిల్లల పాలిట అతనొక వరం ..! సాయం చెయ్యడమే అతనికున్న నైజం…!

August 1, 2017

పేద పిల్లలను చదువుల తల్లి అక్కున చేర్చిన ఆప్తుడు,

పుట్టిన ఊరిని డిజిటల్ గ్రామంగా తీర్చిదిద్దిన సేవకుడు,

తెలంగాణ ఔన్యత్యాన్ని ఎల్లలు దాటించడంకోసం నిరంతరం కష్టపడే సైనికుడు,

సాయం చేయడంలో లెక్కలు చూసుకోని  మంచి మనసున్నోడు,

అమెరికాలో ఎందరో విధ్యార్ధులకు  మైక్రో ఇన్ఫో అనే కంపెనీ ద్వారా ఉద్యోగాలిప్పిస్తున్న వారధి

అప్పిరెడ్డిగారికి జన్మదిన శుభాకాంక్షలు..

బాగా డబ్బు సంపాదించాలి,లగ్జరీగా బ్రతకాలి,అన్ని సౌకర్యాలతో కలిగన పెద్ద ఇల్లు కొనుక్కోవాలి,కుటుంబాన్ని బాగా చూస్కోవాలి,మన పిల్లలు,వాళ్ల పిల్లలు ,వాళ్ల వాళ్ల పిల్లలు ఫ్యూచర్లో వాళ్లకు ఏం కష్టం రాకుండా కూర్చొని తినేంత సంపాదించాలి,నాకుటుంబం,నాఇల్లు ,నావాళ్లు నా నా నా…దాదాపు ప్రతీ మనిషికి ఇలాంటి ఆలోచనలు ఉండడం సహజం.కానీ అవుతలోడికి సాయం చెయ్యాలనే గుణం  ప్రపంచంలో ఎంత మందికి ఉంటుంది చెప్పండి,మనమైతే  ఎలాగో కష్టపడి పైకొచ్చాం,డబ్బు సంపాదించాం హ్యాపీగా బ్రతుకుదాం అని ఆలోచించకుండా ,మనం బాగుంటే సరిపోదు మన చుట్టూ ఉన్న వాళ్లు కూడా బాగుండాలి,వాళ్లు ప్రయోజకులు కావాలి,ఉన్నత స్థానాలకు వెళ్లాలి అని ఆలోచించే కొద్దిమందిలో అప్పిరెడ్డిగారు ఒకరు.

 ఆదెమ్మ  హుస్సేన్ రెడ్డి  ఫౌండేషన్ (AHR FOUNDATION)…..!

ఎ హెచ్ ఆర్  ఫౌండేషన్  బహుశా చాలామందికి  ఈ ఫౌండేషన్ గురించి తెలియక పోవచ్చు,కానీ ఆ చదువుల తల్లి సరస్వతీ దేవికి తెలుసు..ఆ ఫౌండేషన్ ద్వారా  ఎంతమంది చదువుకు నోచుకోని పేద పిల్లలు  చదువుకుని ప్రయోజకులు అవుతున్నారో అని. విద్యలేని వాడు వింత పశువు అంటారు,మరి అటువంటి గొప్ప చదువుని అందరికి అందించాలి,కేవలం పేదరికం కారణంగా ఆ చదువుకు పిల్లలు దూరం కావద్దు అనే ఆలోచనలోంచి పుట్టిందే  ఎహెచ్ ఆర్ ఫౌండేషన్, అప్పిరెడ్డి గారు తన తమ్ముడి వెంకట్ రెడ్డితో కలిసి  వాళ్ల అమ్మమ్మ ఆదెమ్మ, తాత హుస్సేన్ రెడ్డి  పేరు మీద  AHR ఫౌండేషన్ ను స్థాపించారు, ఈ ఫౌండేషన్ ద్వారా ఎంతో మంది పేదపిల్లలు ,అనాథ పిల్లలు…చదువుకుంటూ ప్రయోజకులవుతున్నారు,వాళ్ల తిండి బట్ట దగ్గరనుంచి  వాళ్లకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూరుస్తూ కేజీ టు పీజీ లెక్క వాళ్లెంతవరకు చదువుకుంటే.. అంతవరకు చదివిపిచ్చి వాళ్లను ప్రయోజకులను చేయడమే  AHR ఫౌండేషన్ ముఖ్య ద్యేయం.

ఒక మనిషికి  డబ్బు పరంగానో,లేక తినడానికి తిండో ,లేక ఇంకో విధంగానో సాయం చేస్తే  ఆ సాయం వాళ్లకు కొన్ని రోజులు వరకు గుర్తుండచ్చు,ఆ తర్వాత మర్చిపోవచ్చు,కానీ ఒక మనిషికి చదువు అనే గొప్ప అస్త్రాన్ని సాయం చేస్తే  వాడు సంపాదించిన జ్ఝానంతో ఇంకో పదిమందికి సాయం పడతాడు అనే గొప్ప ఆలోచనకి శ్రీకాంరం చుట్టిన అప్పిరెడ్డి గారికి  సెల్యూట్ చెయ్యాల్సిందే

 అప్పిరెడ్డి గారి గురించి…!

ఎక్కడి దొండపాడు ,ఎక్కడి అమెరికా…వ్యవసాయ కుటుంబంలో పుట్టి  అమెరికాలో మైక్రో ఇన్ఫో వ్యవస్థాపకుడిగా ఎదిగిన వైనం.కన్నతండ్రి వెంకటేశ్పర రెడ్డి,తల్లి అక్కమ్మలకు తను గొప్ప ప్రయోజకుడై వాళ్లకు గొప్పపేరు తీసుకురావడమే కాకుండా…పుట్టిన ఊరికి ఏదో చెయ్యాలని..దాన్ని దత్తత తీస్కొని..  తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ (టిటా)మరియు కొందరు ఎన్నారైలతో కలిసి సూర్యాపేట జిల్లా నాళ్ల చెరువు మండలం…దొండపాడు ఊరును  వందశాతం డిజిటల్ విలేజ్ గా,అక్షరాస్యత కలిగిన విలేజ్ గా మార్చారు అప్పిరెడ్డి. AHR ఫౌండేషన్ ను స్థాపించి,ఎందరో పేద,అనాథ విద్యార్ధులకు విద్యనందిస్తున్నారు,

అమెరికాలో  మైక్రో ఇన్ఫో అనే సంస్ధను ఒక మిత్రుడితో స్ధాపించి  ఈరోజు  400 మంది ఆసంస్థలో పని చేస్తున్నారు.స్కిల్స్ లేని,జాబ్ రానీ ఎందరో విద్యార్థులకు  స్కిల్స్ నేర్పించి  అమెరికాలో ఉన్న ఎన్నో పెద్ద పెద్ద కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తుంది ఈ మైక్రో ఇన్ఫో కన్సల్టెన్సీ.

ఎహెచ్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  అప్పిరెడ్డి పుట్టినరోజు వేడుకలు…!

అప్పిరెడ్డి పుట్టిన రోజు సందర్బంగా ఎహెచ్ ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో  పలు సేవాకార్యక్రమాలు జరిగాయి. వరంగల్ జిల్లా జాఫర్ గడ్ మండల్ రేగడి తండాలో గల”మాఇల్లు ప్రజాదరణ ఆశ్రమంలో “కేక్ కట్ చేసి,పిల్లలకు కావలసిన వస్తువులను(చైర్స్,డైనింగ్ టేబుల్స్ ) AHR ఫౌండేషన్ వారు పంపిణీ చేశారు.

మరియు

పాతబస్తీలో గల దూద్ బోలీలో ఉన్న అశ్విత రేయిన్ బో హోమ్స్ లోని పిల్లలందరికి గిఫ్ట్ లు ఇచ్చి,పిల్లలకు అవుసరమయ్యే వస్తువులను,అశ్విత రేయిన్ బో హోమ్స్ కి వంటసామాగ్రిని అందించారు,

రామోజీ ఫిలింసీటీలో ఉన్న ఆలేటి ఆటమ్ వరల్డ్ లో ఉన్న మానసిక రోగులకు అవసరార్థం ఆర్థిక సహాయాన్ని అందించారు.

చాలామంది తమ పుట్టినరోజుల సందర్బంగా పార్టీలకనీ,ఆడంబరాలకనీ…అవసరంలేని ఎన్నో వాటికి అనవసరంగా డబ్బు ఖర్చు చేస్తారు,కానీ దేశంలో చాలామందికి చదువుకునే స్థోమతలేక,వేసుకోవడానికి సరైన బట్టలు లేక ఆఖర్కి తినడానికి తిండిలేక కొన్ని కోట్ల మంది అల్లాడుతున్నారు.

మీరు ఖర్చుపెట్టే  ఆ డబ్బులో కొంతవరకైనా ఇలాంటి వారికి సాయం చేస్తే,సాయం పొందిన వాళ్ల ముఖాల్లో చూసే ఆనందంలో వచ్చే కిక్,మీకు ఎక్కడా రాదు ఇది మాత్రం కన్ఫాం,ఆ కిక్ ను ప్రస్తుతం నేను పొందుతున్నాను,ఇతరులకు సాయం చేసి అందరూ ఆ మనసంతృప్తిని పొందాలని ఆశిస్తున్నారు ..అప్పిరెడ్డి.