ఏహెచ్ఆర్ ఫౌండేషన్ 11వ వార్షికోత్సవం సందర్భంగా ఫౌండర్ చైర్మన్, మైక్ టీవీ అధినేత అన్నపురెడ్డి అప్పిరెడ్డి పేద విద్యార్ధులకు చెక్కులు పంపిణీ చేశారు. వివిధ పాఠశాలల్లో చదువుతున్న సుమారు 80 మంది విద్యార్ధుల ఫీజుల చెక్కులను దొండపాడు అరుణోదయ పాఠశాలలో విద్యార్ధుల తల్లిదండ్రులకు అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా స్కూలు ఫీజులు చెల్లిస్తున్నామని, మున్ముందు కూడా పేద విద్యార్ధులను ఆదుకుంటామని తెలిపారు. అనంతరం అతిథులుగా వచ్చిన పెద్దలు మాట్లాడుతూ.. అన్ని దానాల్లో విద్యా దానం గొప్పదని, ఏమీ ఆశించకుండా పేద విద్యార్ధుల కోసం పాటుపడడం గొప్ప విషయమని ప్రశంసించారు. ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా చేయాలని, ఇదే పరంపరను కొనసాగించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎక్స్ డీసీ చైర్మన్ అన్నపురెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, ఫౌండర్ వెంకట అప్పారెడ్డి, చక్రధర్, అరుణోదయ కరస్పాండెంట్ నిరంజన్, ఎంపీపీ కొత్తమద్ధి వెంకటరెడ్డి, ఎల్ఐసి వెంకట్ రెడ్డి, సర్పంచ్ అన్నపురెడ్డి పద్మ వెంకట రంగారెడ్డి, అన్నపరెడ్డి వెంకట్, ఉపాధ్యాయులు, విద్యార్ధులు వారి తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.