AHR ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం రేపే! - MicTv.in - Telugu News
mictv telugu

AHR ఫౌండేషన్ 6వ వార్షికోత్సవం రేపే!

February 16, 2018

ఆదెమ్మ హుస్సేన్ రెడ్డి ఫౌండేషన్(ఏహెచ్ఆర్ ఫౌండేషన్).. అందరికి విద్య అందించాలనే లక్ష్యంతో ఏర్పాటైన ఫౌండేషన్. 2012లో మొదలై ఇప్పటికీ ఎంతో మంది పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దింది, దిద్దుతోంది. మనిషి మనుగడకు ఆహారం, నీరు ఎంత ముఖ్యమో మనో వికాసానికి, వర్తమానంలో ఉపాధికి చదువు అంత ముఖ్యం.

అలాంటి చదువుకు ఎవరూ దూరం కావద్దనే ఉద్దేశంతో ఆరేళ్ల కిందట మైక్ టీవీ అధినేత అన్నపరెడ్డి అప్పిరెడ్డి తన తమ్ముడు వెంకట్ రెడ్డితో కలిసి గొప్ప లక్ష్యానికి నాంది పలికారు. తమ అమ్మమ్మ ఆదెమ్మ, తాత హుస్సేన్ రెడ్డి పేరు మీద ఈ ఫౌండేషన్‌ను స్థాపించారు.

ఈ ఫౌండేషన్ ద్వారా పేదపిల్లలకు, అనాథ పిల్లలకు కావలసిన అన్ని సౌకర్యాలు సమకూర్చి వారిని ప్రయోజకులుగా తీర్చుదిద్దుతున్నారు. గత ఆరు సంవత్సరాలుగా ఎంతో మంది పిల్లలు ఈ ఫౌండేషన్ ద్వారా చదువుకుంటున్నారు. ఈ ఫౌండేషన్ ఆరవ వార్షికోత్సం రేపు (శనివారం) అప్పిరెడ్డి సోదరుల సూర్యాపేట జిల్లా దొండపాడు గ్రామంలో జరగనుంది.