హలో హలో.. వాయిస్ టెస్ట్‌తో కరోనా పరీక్ష.. - MicTv.in - Telugu News
mictv telugu

హలో హలో.. వాయిస్ టెస్ట్‌తో కరోనా పరీక్ష..

August 10, 2020

AI-based voice testing procedure for Coronavirus

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ను పరీక్షించడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కానీ, టెస్టుల ఫలితాలు రావడానికి ఆలస్యం అవుతుంది. ఈ నేపథ్యంలో ముంబైకి చెందిన బృహన్ ముంబయి కార్పొరేషన్(బీఎంసీ) మనిషి వాయిస్ టెస్ట్ ద్వారా కరోనా ఉందో లేదో చెప్పే కొత్త సాంకేతికతను అందుబాటులోకి తీసుకొచ్చింది. కరోనా సోకిందని అనుమానించే వ్యక్తిని ఫోన్ ద్వారా లేదా కంప్యూటర్ ద్వారా మాట్లాడించి ఆ మాటలను హై టెక్నాలజీతో విశ్లేషిస్తారు. ఆ వ్యక్తి మాటల్లోని హెచ్చుతగ్గులను పరిశీలించి అతడికి కరోనా ఉందా లేదా అని ప్రాథమిక నిర్ధారణకు వస్తారు. ఈ సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)తో అభివృద్ధి చేశారు. ఈ వాయిస్ టెస్ట్ టెక్నాలజీని ఇప్పటికే ఇటలీ, ఫ్రాన్స్ దేశాలు వినియోగిస్తున్నాయి.

ఇది ఎలా పనిచేస్తుంది?

మనుషులు గట్టిగా గట్టిగా మాట్లాడడంలో ఊపిరితిత్తుల సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుంది. ఊపిరితిత్తుల సమస్య లేని వాళ్ళు గట్టిగా మాట్లాడగలరు. కానీ, కరోనాతో ఊపిరితిత్తులు ప్రభావితమైనప్పుడు ఆ వ్యక్తి గట్టిగా మాట్లాడలేరు. దీంతో అతని వాయిస్ బలహీనంగా వస్తుంది. ఆ బలహీన ధ్వనులను ఈ టెక్నాలజీ పసిగడుతుంది. వచ్చే వారం గుర్ గ్రామ్ లో వెయ్యి మంది కరోనా అనుమానితులకు ఈ వాయిస్ టెస్ట్ లు చేసి పరిక్షిస్తామని అదనపు మున్సిపల్ కమిషనర్ సురేష్ కాకాని శనివారం తెలిపారు.