ఎయిడ్స్ కు మందు ఉందా…లేదు… లేనే లేదు.. నివారణ ఒక్కటే మార్గం.కానీ పాము విషంతో ఎయిడ్స్‌ను పూర్తిగా నయం చేస్తామంటున్నారు హైదరాబాద్ రామంతాపూర్ లోని హోమియోపతి వైద్యులు. ఇదేలా సాధ్యమో గానీ.. పాము విషంతో ఎయిడ్స్ పూర్తిగా నయం చేస్తారట. ఇది ఈ నోటా ఆనోటా రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాలకు పాకింది. ఇంకేముంది ఎయిడ్స్ బాధితులు క్యూకట్టారు. తెలంగాణ. ఏపీ నుంచే కాక ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. వారానికి సుమారు వెయ్యి మంది ఆసుపత్రికి వస్తున్నారట. 30 మంది రోగులకు ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేసినట్లు ఆ వైద్యులు చెబుతున్నారు. మరో మూడు వేల మందికి వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టిందంటున్నారు. చికిత్స చేస్తున్న వారి వివరాలను నమోదు చేసుకుని వారికి రెగ్యూలర్‌గా పరీక్షలు నిర్వహిస్తూ వ్యాధి తీవ్రతను తెలుసుకుంటున్నారట..నిజంగా ఇది నిజమైన మెడిసినేనా… ఏళ్లఏళ్లకు వైద్య మేధావులు ఎయిడ్స్ నివారణ మందు కోసం ప్రయోగాలు చేస్తున్నారు. ఇప్పటిదాకా ఏలాంటి మందు కనిపెట్టలేకపోయారు. కానీ ఈ హోమియో పతి వైద్యంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు..బాధితులు మాత్రం ఎగబాడుతున్నారు.