కరోనా కాలంలో 5 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు చనిపోతారు!..డబ్ల్యూహెచ్‌ఓ - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కాలంలో 5 లక్షల మంది హెచ్‌ఐవీ రోగులు చనిపోతారు!..డబ్ల్యూహెచ్‌ఓ

May 12, 2020

AIDS, TB And Malaria Set To Get Deadlier Due To Coronavirus says united nations

ప్రపంచం దృష్టి అంతా కరోనా మహమ్మారిపై కేంద్రీకృతమై ఉంది. ఎవరి నోట విన్నా కరోనా మాటే వినిపిస్తుంది. డాక్టర్లు, నర్సులు ఇతరత్రా వైద్య సిబ్బంది అంతా కరోనా విధుల్లో బిజీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌ఓ) సంస్థ కీలక ప్రకటన చేసింది. కరోనా సమయంలో హెచ్‌ఐవీ రోగులకు సరైన వైద్య సదుపాయాలు అందకపోతే ఎయిడ్స్‌తో మరణించే వారి సంఖ్య రెట్టింపు హెచ్చరించింది. సహారా ఆఫ్రికా ప్రాంతంలో ఉన్న దాదాపు 25.7 మిలియన్ హెచ్‌ఐవీ పేషంట్లలో 16.4 మిలియన్‌ మందికి యాంటీవైరల్‌ థెరపీ నిరంతయరాయంగా కొనసాగాల్సి ఉంది. లేనట్లయితే వారి ప్రాణాలకే ప్రమాదం.

‘కరోనా వైరస్ వ్యాప్తి వల్ల యాంటీవైరల్‌ థెరపీకి అంతరాయం కలిగితే 2020-21 నాటికి సహారా ఆఫ్రికా ప్రాంతంలో 5 లక్షలకు మించి ఎయిడ్స్ మరణాలు సంభవించే అవకాశం ఉంది’ అని డబ్ల్యూహెచ్‌ఓ, యూఎన్‌ఎయిడ్స్‌ సోమవారం విడుదల చేసిన ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి. లాక్‌డౌన్‌తో హెచ్‌ఐవీ రోగులకు అందించే సేవలు, మందుల సరఫరాకు అంతరాయం కలిగిందని పేర్కొన్నాయి.