గోవుల నుంచి ఎయిడ్స్ మందు..! - MicTv.in - Telugu News
mictv telugu

గోవుల నుంచి ఎయిడ్స్ మందు..!

July 24, 2017

గోవులతో ఎన్నో లాభాలు..ఆవు మూత్రంతో అనారోగ్య సమస్యలు చిటికెలో మాయం. అంతే కాదు ఆ మధ్య ఆవుల మూత్రంలో బంగారం ఉందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇప్పుడు గోవుల నుంచి ఎయిడ్స్ టీ కాకు అవసరమయ్యే ప్రొటీన్లు ఉన్నట్టు సైంటిస్టులు గుర్తించారు.

ఆవు మూత్రంలో శ‌క్తివంత‌మైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. ఇన్‌ఫెక్ష‌న్ల‌ను న‌యం చేస్తాయి. క్యాన్స‌ర్ల‌ను అడ్డుకునే శ‌క్తి ఆవు మూత్రానికి ఉంది. వాత‌, పిత్త‌, క‌ఫాల్లో వ‌చ్చే అస‌మ‌తుల్య‌త వచ్చే రోగాల్ని నయం చేసే శ‌క్తి ఆవు మూత్రానికి ఉంది. దీంతో అనేక ర‌కాల రోగాలు న‌య‌మ‌వుతాయి.అందుకే మందుల్లో గోమూత్రాన్ని వాడుతారు.

ఆ మధ్య గుజరాత్ లోని జునాఘడ్ జిల్లాలో ఎక్కువగా కనిపించే గిర్ జాతికి చెందిన ఆవుల మూత్రంలో బంగారం ఉన్నట్లు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దాదాపు 400 గిర్ జాతి ఆవుల మూత్రంపై నాలుగేళ్ల పాటు విస్తృతంగా పరిశోధనలు జరిపిన జునాఘడ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లీటర్ మూత్రంలో మూడు మిల్లీ గ్రాముల నుంచి 10 మిల్లీ గ్రాముల వరకు బంగారం ఉన్నట్టు పేర్కొన్నారు. బంగారానికి సంబంధించిన ధాతువులు నీటిలో కలిసిపోయి ఆవుల మూత్రం ద్వారా బయటకు వెళ్లిపోతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

ఇప్పడు తాజాగా గోవుల్లో ఎయిడ్స్ టీకాకు అవసరమయ్యే ప్రోటీన్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితో వ్యాధిని నిరోధించే వచ్చని తేల్చారు. కొన్ని రకాల జాతుల దూడల్లో హెచ్ ఐ వీని అడ్డుకోగల శక్తివంతమైన ప్రతిరోధకాలు యుఎస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ తెలిపింది. నాలుగు ఆవులపై పరిశోధన చేసింది. ఈ పరిశోధనతో ఎయిడ్స్ టీకా కనుగోనడం లో శాస్త్రవేత్తలు మరో ముందడుగు వేశారు.