AIIMS Delhi doctors gifted eyesight with pigskin
mictv telugu

పందిచర్మంతో 20 మందికి కంటి చూపు.. ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల ఘనత

August 13, 2022

 

కంటి చూపు లేని, కంటి చూపు కోల్పోయిన 20 మంది జీవితాల్లో ఎయిమ్స్ డాక్టర్ల బృందం వెలుగులు నింపారు. వారికి కంటి చూపు ప్రసాదించారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు ఈ ఆపరేషన్ అద్దం పడుతోంది. కనుగుడ్డు ముందు భాగాన్ని కప్పి ఉంచే సున్నితమైన పొర కార్నియా ఇంప్లాంట్‌లో పంది చర్మం వినియోగించి ఎయిమ్స్ వైద్యులు విజయం సాధించారు. ఇంతకు ముందు వ్యక్తుల నుంచి విరాళంగా వచ్చిన కార్నియాతో కంటి చూపు వస్తుండగా, ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా పంది చర్మంతో తయారు చేసిన బయో ఇంజినీర్డ్ ఇంప్లాంట్‌ను ఉపయోగించింది. ఈ సందర్భంగా ఎయిమ్స్ డాక్టర్లు మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.27 కోట్ల మంది కార్నియా సమస్యలతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అయితే దాతల నుంచి అవసరమైన మోతాదులో కార్మియాలు దొరక్కపోవడంతో చాలా మంది కంటిచూపుకు నోచుకోలేకపోతున్నారని, తాజా చికిత్సతో సమస్యకు పరిష్కారం దొరికినట్టైందని వెల్లడించారు. కాగా, ఈ పరిశోధనలో అంతర్జాతీయ డాక్టర్లు కూడా పాల్గొనగా, పేషెంట్లలో కొందరు ఇరాన్ దేశానికి చెందిన వారు కూడా ఉన్నారు.