కరోనా రోగిని కాపాడ్డానికి ప్రాణాలకు తెగించిన డాక్టర్
కరోనాపై వైద్యులు అలుపెరగని పోరాటం చేస్తూనే ఉన్నారు. వైరస్‌ను తరిమేసేందుకు అన్ని విధాలుగా కష్టపడుతూనే ఉన్నారు. ఈ క్రమంలో ఢిల్లీలోని ఎయిమ్స్ వైద్యుడొకరు ఎవరూ చేయని సాహసం చేశాడు. వైద్యం చేసేందుకు పీపీఈ కిట్ అడ్డు తగడలంతో వాటిని తీసేసి మరీ ప్రాణం పోశాడు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో అతడు చేసిన సాహసాన్ని పలువురు అభినందిస్తున్నారు. పీపీఈ కిట్ లేకుండా పాజిటివ్ రోగిని నేరుగా తాగడంతో అతన్ని క్వారంటైన్‌కు పంపించారు.
అనంత్‌నాగ్‌కు చెందిన డాక్టర్ జహీద్ అబ్దుల్ అహ్మద్.. ఎయిమ్స్‌లో పని చేస్తున్నాడు. ఓ కరోనా రోగిని అంబులెన్స్‌లో ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లోని ఐసీయూకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ సమయంలో రోగి గొంతులో ఆక్సిజన్ కోసం అమర్చిన పైపు ఊడిపోయింది. తీవ్ర అవస్థతకు గురౌతున్న అతన్ని గమనించిన డాక్టర్ తిరిగి అమర్చే ప్రయత్నం చేశాడు. కానీ అంబులెన్సులో అంతా చీకటిగా ఉండటంతో అతడు ధరించి పీపీఈ కిట్ అద్దాలను ముఖానికి ఉన్న కవచాన్ని తీసేసి పైపును అమర్చాడు.ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రోగిని కాపడటం కోసం అతడు చేసిన ప్రయత్నాన్ని పలువురు అభినందిస్తున్నారు.