Brain Stroke : భారత్‎లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడానికి కారణమేంటో వెల్లడించిన ఎయిమ్స్..!! - MicTv.in - Telugu News
mictv telugu

Brain Stroke : భారత్‎లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు పెరగడానికి కారణమేంటో వెల్లడించిన ఎయిమ్స్..!!

March 13, 2023

ఈమధ్యకాలంలో భారత్‎లో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్రతి సెకను ఒకరు బ్రెయిన్ స్ట్రోక్ తో మరణిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఒత్తిడి, ఆందోళన, కోపం, ప్రతికూల భావోద్వేగాలే బ్రెయిన్ స్ట్రోక్ కు ప్రధాన కారణం. భారతీయలు ఆరోగ్యం కంటే వృత్తిని ఇష్టపడే ఇతర దేశాల కంటే చాలా ముందున్నారు. ఈ ఒత్తిడే వారిలో బ్రెయిన్ స్ట్రోక్ కారణమవుతోంది. భారతదేశంలో బ్రెయిన్ స్ట్రోక్ కేసులు వేగంగా పెరగడానికి కూడా ఇదే కారణం. దేశంలో సంభవిస్తున్న మరణాల్లో బ్రెయిన్ స్ట్రోక్ తోనే మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువగా ఉన్నట్లుఎయిమ్స్ వెల్లడించింది.

AIIMS నివేదిక ప్రకారం, దేశంలో ప్రతి సెకనుకు ఒకరు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురవుతున్నారు. ప్రతి నాలుగు నిమిషాలకు ఒకరు మరణిస్తున్నారు. ఇందులో ముఖ్యమైన విషయం ఏమిటంటే, యువకులు, 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు ఎక్కువగా స్ట్రోక్‌కు గురవుతున్నారని తేలింది. అంటే ప్రతి సంవత్సరం 1 లక్షా 85 వేల బ్రెయిన్ స్ట్రోక్ కేసులు నమోదు అవుతున్నాయి. అందులో 62 లక్షల మంది 20 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళనను కలిగిస్తోంది.

శారీరక శ్రమను పెంచుకోవాలని ఆరోగ్య నిపుణులు నిరంతరం హెచ్చరిస్తూనే ఉన్నారు. రెగ్యులర్ వ్యాయామాలు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చని సూచించే అనేక పరిశోధనలు ఉన్నాయి. ఇటీవల ఒక అధ్యయనం ప్రకారం మీరు రోజువారీ దినచర్య కంటే 500 అడుగులు ఎక్కువగా నడిస్తే, మీరు స్ట్రోక్ ప్రమాదాన్ని 14% తగ్గించవచ్చని పేర్కొంది.