వీడిన సుశాంత్ మృతి మిస్టరీ.. ఎయిమ్స్ కీలక నివేదిక - MicTv.in - Telugu News
mictv telugu

వీడిన సుశాంత్ మృతి మిస్టరీ.. ఎయిమ్స్ కీలక నివేదిక

September 29, 2020

sushant sing

బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్ మృతి కేసులో మిస్టరీ వీడింది. మంగళవారం ఎయిమ్స్ వైద్య బృందం కీలక నివేదిక ఇచ్చింది. ఆయనపై విషప్రయోగం జరిగిందనే అనుమానంతో సుదీర్ఘ కాలం పరీక్షలు జరిపారు. తాజాగా వీటికి సంబంధించిన తుది రిపోర్ట్ వెల్లడించారు. ఉరివేసుకోవడం వల్లే అతడు చనిపోయాడని స్పష్టం చేశారు. ఎలాంటి విషప్రయోగం జరగలేదని పేర్కొన్నారు. దీంతో ఇప్పటి వరకు వ్యక్తమైన అనుమానాలకు ఏయిమ్స్ పరీక్షలతో తేలిపోయాయి. గతంలో ముంబై వైద్య బృందం ఇచ్చిన నివేదిక ప్రకారమే తమ పరిశీలనలోనూ వెల్లడయ్యాయని తెలిపారు. 

మృతదేహంలో ఎలాంటి విషం లేదని ఎయిమ్స్ వైద్యులు తెలిపారు. దీనిపై సందేహాలు అవసరం లేదన్నారు. ఉరివేసుకోవడంతోనే చనిపోయాడని నిర్ధారించారు. మానసిక ఒత్తిడి కారణంగానే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని అభిప్రాయపడ్డారు. కాగా జూన్‌ 14న ముంబైలోని తన నివాసంలో  సుశాంత్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై పలువురు అనుమానం వ్యక్తం చేయడంతో విష ప్రయోగం జరిగిందనే వాదనలు తెరపైకి వచ్చాయి. ఆయన మాజీ ప్రియురాలు రియా చక్రవర్తిపై విమర్శలు వచ్చాయి. బాలీవుడ్ నెపోటిజం కూడా కారణమనే ఆరోపణలు పెరిగాయి. ఎయిమ్స్ తీనిపై క్లీన్ చీట్ ఇచ్చింది. ప్రస్తుతం సీబీఐ దీనిపై వేగంగా విచారణ జరుపుతోంది.