మోడీ రాష్ట్రంలో ఎంఐఎం పోటీ.. అసదుద్దీన్ ప్రకటన - MicTv.in - Telugu News
mictv telugu

మోడీ రాష్ట్రంలో ఎంఐఎం పోటీ.. అసదుద్దీన్ ప్రకటన

May 30, 2022

త్వరలో జరుగనున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) సిద్ధమైంది. ఎన్నికల్లో పోటీకి అభ్యర్థుల ఎంపిక, పార్టీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు ఆ పార్టీ అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ నిన్న(ఆదివారం) పోర్‌బందర్లో పర్యటించారు. కాగా ఆయన ట్విట్టర్లో ఈ వివరాలను పోస్టు చేశారు. “నేను గుజరాత్ ఎన్నికల కోసం కచ్‌లో కొన్ని పార్టీ సమావేశాలు, ర్యాలీలో పాల్గొనడానికి పోర్‌బందర్‌కు వచ్చాను. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో 12 రోజుల సన్నద్ధతతో మేం బాగానే చేశాం’’ అని ఒవైసీ ట్విట్టర్లో పేర్కొన్నారు. అయితే.. మహారాష్ట్రలోని భివాండీలో ప్రసంగిస్తూ “వారు తాజ్ మహల్ కింద ప్రధానమంత్రి డిగ్రీ కోసం వెతుకుతున్నారు” అని ఒవైసీ ఎద్దేవా చేశారు.