MIM సంచలన నిర్ణయం.. మహా కూటమికి మద్ధతు - MicTv.in - Telugu News
mictv telugu

MIM సంచలన నిర్ణయం.. మహా కూటమికి మద్ధతు

June 10, 2022

4 రాష్ట్రాల్లోని 16 రాజ్యసభ స్థానాలకు శుక్రవారం ఉదయం ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుండి పోలింగ్ ప్రారంభమైంది. మహారాష్ట్ర, కర్ణాటక, హరియాణా, రాజస్థాన్‌ రాష్ట్రాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. అయితే.. మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమి, బీజేపీ మధ్య టఫ్ ఫైట్ కొనసాగుతోంది. ఈ క్రమంలో ఏఐఎంఐఎం పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో జరగుతున్న రాజ్యసభ ఎన్నికల్లో శివసేన నేతృత్వంలోని మహా వికాస్ అఘాడి కూటమికి మద్దతు ఇస్తున్నట్లు మజ్లిస్ శుక్రవారం తెలిపింది. మహారాష్ట్రలోని ఇద్దరు ఎంఐఎం ఎమ్మెల్యేలు కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ ప్రతాప్‌గర్హికి ఓటు వేయాలని నిర్ణయించినట్టు తెలిపింది. పోలింగ్‌కు కొద్ది గంటల ముందే ఈ పరిణామం చోటుచేసుకోవడం గమనార్హం. ఈ మేరకు ఔరంగాబాద్‌ ఎంఐఎం ఎంపీ ఇంతియాజ్ జలీల్ ట్వీట్ చేశారు. మహావికాస్ అఘాడీలోని భాగస్వామి శివసేసతో రాజకీయ సైద్ధాంతిక విభేదాలు మాత్రం కొనసాగుతాయని స్పష్టం చేశారు.