‘బై నౌ.. ఫ్లై నౌ’రూ.1,031లకే విమాన టికెట్‌..! - MicTv.in - Telugu News
mictv telugu

‘బై నౌ.. ఫ్లై నౌ’రూ.1,031లకే విమాన టికెట్‌..!

May 15, 2017


దేశీయ విమానయాన సంస్థ ఎయిర్‌ఏషియా తన విమానాల్లో ప్రయాణించే వారికి స్పెషల్ ఆఫర్లు ప్రకటించింది. ఎంపిక చేసిన రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు అందిస్తుంది. ‘బై నౌ.. ఫ్లై నౌ’ పేరుతో తీసుకొచ్చిన ఈ పథకంలో ప్రారంభ ధర రూ.1,031లకే విమాన టికెట్‌ను ఇస్తోంది.

మే 21 వరకూ అందుబాటులో ఉండే ఈ పథకం ద్వారా టికెట్లు బుక్‌ చేసుకున్న వారు సెప్టెంబర్‌ 4, 2017లోపు ప్రయాణించాల్సి ఉంటుంది. రాంచి-కోల్‌కతా(రూ.1,220), గోవా-హైదరాబాద్‌(1,237) న్యూఢిల్లీ-శ్రీనగర్‌(రూ.2,062) రూట్లలో అతి తక్కువ ధరకు టికెట్లు లభించనున్నాయి. ఈ మేరకు తన వెబ్‌సైట్‌లో పూర్తి వివరాలను ఎయిర్‌ఏషియా అందుబాటులో ఉంచింది.

HACK:

  • Air Asia Announces Special Offers for Domestic Travelers.