ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ఏయిర్ ఏషియా వెరైటీ ఆఫర్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ఏయిర్ ఏషియా వెరైటీ ఆఫర్

November 20, 2019

టికెట్‌పై డిస్కౌంట్లతో పాటు ఎప్పుడూ ఏదో ఒక రాయితీ ఇచ్చే ఏయిర్ ఏషియా తన ప్రయాణికులకు ఓ వినూత్న ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఢిల్లీ వెళ్లే ప్రయాణికులకు ప్రత్యేకంగా మాస్కులను పంపిణీ చేస్తోంది.వాయు కాలుష్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఉచితంగా యాంటీ పొల్యూషన్‌ మాస్క్‌నను ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఈనెల 29 వరకూ వెళ్లే ప్రయాణికులకు వీటిని అందించనున్నారు. 

Air Asia.

హెల్త్‌ టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీలతో కలిసి వీటిని అందిస్తున్నారు.హైదరాబాద్‌, బెంగళూరు, ముంబై,కోల్‌కతా నుంచి వెళ్లే వారికి వీటిని అందిస్తున్నారు. కాగా గత కొన్ని రోజులుగా హస్తినలో వాయు కాలుష్యం దారుణంగా పెరిగిపోయింది. పొగ, దుమ్ము కణాల కారణంగా రోడ్లు కూడా కనిపించడం లేదు. దీన్ని అదుపులోకి తెచ్చేందుకు ఇప్పటికే అక్కడి ప్రభుత్వం సరి బేసి విధానాన్ని తెచ్చింది. చాలా మంది సైకిళ్లు, ఎలక్ట్రిక్ బైకులు వాడుతున్నారు. దీంతో అక్కడికి వెళ్లే టూరిస్టులు, ఇతర పనులకు వెళ్లే వారికి ఇబ్బంది కలగకుండా ఈ వినూత్న ఆలోచన చేసింది ఏయిర్ ఏషియా.