కాలుష్య నివారిణి ఈ బయోగ్యాస్ బస్సులు ! - MicTv.in - Telugu News
mictv telugu

కాలుష్య నివారిణి ఈ బయోగ్యాస్ బస్సులు !

September 8, 2017

పెట్రోల్, డీజిల్ అవసరం లేకుండా కేవలం బయోగ్యాస్ తో నడిచే బస్సులు కలకత్తా రోడ్డు పైకి వచ్చేసాయి. అతి తక్కువ చార్జీలతో ఈ బస్సు ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమవనుంది. కేవలం ఒక రూపాయికి 17 కిలోమీటర్ల గమ్యం వరకు ప్రయాణీకులను తీస్కెళ్తుంది. ప్రస్తుతం ఈ బయోగ్యాస్ బస్సులను 16 వరకు రోడ్ల పైకి తీస్కొచ్చారు. ఫీనిక్స్ ఇండియా రీసెర్చ్ అండ్ డెవ్ లప్ మెంట్ గ్రూపు ఈ సర్వీస్ బస్సులను ప్రారంభించింది. ఇది సగటు ప్రయాణీకులకు ఎంతో హర్షించదగ్గ విషయం. తక్కువ ఛార్జీలు ప్లస్ కాలుష్య సమస్యలు అస్సులుండవు. సుమారు 13 లక్షల ఖరీదైన ఈ బస్సులో 54 సీట్ల కెపాసిటీ వుంటుంది. ప్రముఖ వాహన తయారీదారీ కంపెనీ అశోక్ లీలాండ్ ఈ బస్సులను తయారు చేసింది. అయితే ఈ బస్సులకు బయోగ్యాస్ సరఫరాలో కొరత ఏర్పడకుండా కలకత్తా నగరంలో వంద వరకు గోబర్ గ్యాస్ ప్లాంట్ లను నిర్మించే యోచనలో కూడా వున్నారట.

జంతువుల పేడ మరియు చెట్ల వేస్టేజ్, చెత్త నుండి ఈ గ్యాస్ తయారౌతుంది. దీని శాస్త్రీయ నామం మిథేన్ వాయువు. దీనివల్ల ఎలాంటి బ్లాస్టింగ్ వంటి ప్రమాదాలు జరగవు. ఈ గ్యాస్ ఒక ఇంధనంగా పని చేస్తుంది. కాబట్టి ఈ బయోగ్యాస్ బస్సుల వల్ల ఎలాంటి కాలుష్యాలు సంభవించవు. త్వరలోనే దేశంలోని అన్నీ ప్రధాన నగరాలకు ఈ బస్సులను తీస్కొచ్చే యోచనలో వుందట కంపెనీ యాజమాన్యం. మరీ ముఖ్యంగా మన హైదరాబాదులో గనక ఈ బయోగ్యాస్ బస్సులు వస్తే ఎంతో మేలు చేసినట్టు అవుతుంది కదూ.