చేపల కోసం వల వేస్తే విమానం ఇంజిన్ దొరికింది! - MicTv.in - Telugu News
mictv telugu

చేపల కోసం వల వేస్తే విమానం ఇంజిన్ దొరికింది!

November 13, 2019

చేపల కోసం వల వేసిన జాలరి భారీ బరువు తగలడంతో పొంగిపోయాడు. పది మంది లాగినా బయటికి రాని చేప పడిందేమోనని సంతోషించాడు. తీరా వలను ఒడ్డుకు లాగి చూసి కంగుతిన్నాడు. వలలో 1500 కేజీల విమానం ఇంజిన్ కనిపించింది. కేరళలోని ఎర్నాకుళం జిల్లా మునంబంలో ఈ ఉదంతం చోటు చేసుకుంది. 

Air craft.

అరేబియా సముద్రంలో వేటకు వెళ్లిన జాలరి ఆదివారం నీటిలో చేపల వల అమర్చి మంగళవారం తిరిగి అక్కడి వెళ్లాడు. వల బరువుగా ఉండడంతో మిగతా జాలర్లతో కలసి దాన్ని ఒడ్డుకు లాగారు. బాగా తప్పు పట్టిపోయిన విమానం ఇంజిన్ వలలో పడింది. నాలుగైదు దశాబ్దాల కిందట సముద్రంలో ప్రమాదానికి గురైన సైనిక విమానం ఇంజిన్ కావొచ్చని అధికారులు భావిస్తున్నారు. పరీక్షల కోసం దాన్ని లేబొరేటరీకి తరలించారు. నేవీకి, వాయుసేనకు సమాచారం అందించారు.