ప్రమాదవశాత్తూ ఎయిర్ గన్ పేలి నాలుగేళ్ల బాలిక మృతి చెందిన ఘటన సంగారెడ్డిలో జరిగింది. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిన్నారం మండలం వావిలాల గ్రామంలో ఉన్న ఓ ఫామ్‌హౌజ్‌లో ఈ ఘటన జరిగింది. పిల్లలు గన్‌తో ఆడుకుంటుండగా జరిగిన ఈ ప్రమాదంలో శాన్వి అనే బాలిక గాయపడింది. వెంటనే బాలికను ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ తెల్లవారు జామున మరణించింది. మంగళవారం రాత్రి పది గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్టు పటాన్చెరు డీఎస్పీ భీంరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు వివరించారు.