విమానంలో విసన కర్రలు..! - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో విసన కర్రలు..!

July 3, 2017

ఎయిరిండియా విమానాలు అప్పడప్పుడు ఆర్టీసీ బస్సుల్ని గుర్తుచేస్తుంటాయి. గమ్యం చేరేదాకా గడబిడే. ఏసీ బస్సుల్లో ఎక్కువరేట్ టికెట్ కొన్నా..కొన్నిసార్లు ఏసీలు పనిచేయవు. బస్సుల్లో అయితే కిటికీ అద్దాలు తీసుకుంటాం..మరి విమానంలో ఏసీ పనిచేయకపోతే…?

పశ్చిమ బెంగాల్‌లోని బగ్‌డోరా నుంచి ఢిల్లీకి ఎయిరిండియా విమానం 168 మంది ప్రయాణికులతో ఆదివారం మధ్యాహ్నం 1.55 గంటలకు బయల్దేరింది. బయల్దేరిన 20 నిమిషాల తర్వాత ఏసీ పని చేయ లేదు. దీంతో ప్రయాణికులకు ఊపిరి ఆడ లేదు. కొద్ది మంది విమానంలో ఉన్న ఆక్సిజన్ మాస్క్‌లు ఉపయోగించినప్పటికీ.. అవీ పని చేయలేదు. చివరకు న్యూస్ పేపర్లే విసనకర్రలు అయ్యాయి. ఈ విషయాన్ని ప్రయాణికులు ట్విట్టర్ ద్వారా ఎయిరిండియా యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. దీంతో ఆ వీడియోలను సామాజిక మాధ్యమాలలో పోస్టు చేశారు. ఇప్పుడు అవి వైరల్ అవుతున్నాయి.