షాక్.. ఎయిరిండియాకు రోజుకు రూ. 23 కోట్ల నష్టం  - MicTv.in - Telugu News
mictv telugu

షాక్.. ఎయిరిండియాకు రోజుకు రూ. 23 కోట్ల నష్టం 

September 16, 2019

Air india loss .

అప్పుల పాలై దుకాణం మూసేసిన జెట్ ఎయిర్‌వేస్ బాటలో మరో ప్రముఖ ఎయిర్‌లైన్ కూడా సాగుతోంది. ఎయిరిండియా పరిస్థితి నానాటికీ దిగజారుతోంది. నష్టాల ఊబిలో కూరుకుపోయిన ఈ సంస్థ నష్టాల్లో మరో రికార్డు సాధించింది. సంస్థ రోజుకు రూ.23 కోట్ల నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికే రూ. 50 కోట్లకుపైగా అప్పులున్న ఎయిరిండియాకు ఇది చావు దెబ్బే. 

ఎందుకు? 

పదేళ్ల కిందట ఇండియన్ ఎయిర్ లైన్స్ ను ఎయిరిండియాలో విలీనం చేశాక పరిస్థితి బాగానే ఉండింది. మొదట్లో లాభాలు కూడా వచ్చాయి. ఆర్థిక మాంద్యం, నిర్వహణ లోపాలు, ప్రభుత్వ నిర్లక్ష్యం, ప్రైవేటు కంపెనీల నుంచి గొంతుకోత పోటీ.. కారణాలేమైతేనేం ‘మహారాజు’ ప్రాభవం దిగజారిపోయింది. 2018-19 ఆర్థిక సంవత్సరం సంస్థ చరిత్రలో అత్యంత దురదృష్టకర సంవత్సరంగా మారింది. ఈ ఏడాదో రోజుకు 23 కోట్ల చొప్పున మొత్తం రూ. 8400 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఎయిరిండియా నష్టం ఒక ఏడాదిలో 8 వేల కోట్ల మార్కు దాటడం ఇదే తొలిసారి. గత ఎనిమిదేళ్లలో ప్రభుత్వం ఎయిరిండియా సంచిలో రూ. 30వేల కోట్లను కుమ్మరించింది. అయినా సంస్థ కోలుకోవడం లేదు.