చేసింది వెధవ పని…మల్లీ దానికొచ్చి తలతిరుగుడి వాదనతో జైలుకు పోయాడు ఓ పెద్దమనిషి. ఇటీవల ఎయిర్ ఇండియా విమానంలో పొగ త్రాగడంతో పాటు, ఎమెర్జెన్సీ డోర్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నించిన రత్నాకర్ ద్వివేదీకి ముంబై కోర్టు తాజాగా జైలు శిక్ష విధించింది. న్యాయస్థానం విధించిన జరిమానను చెల్లించేందుకు నిరాకరించడంతో జైలుకు పంపించారు.
మార్చి 10న లండన్ నుంచి ముంబై వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ద్వివేదీ పొగతాగుతూ సిబ్బందికి చిక్కాడు. అడ్డుకున్న సిబ్బందిపై ఎదురుతిరిగాడు. . అంతటితో ఆగకుండా విమాన డోర్‌ను తెరిచేందుకు యత్నించాడు. అతడి ప్రవర్తనతో భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు వారించినా ఫలితం లేకుండా పోయింది. దీంతో చివరకు అతడి కాళ్లు, చేతులు కట్టేసి కుర్చిలో కూర్చోబెట్టారు. అనంతరం విమానశ్రయంలో పోలీసులకు అప్పగించారు. దీంతో ద్వివేదీపై సెక్షన్ 336 కింద కేసు పెట్టారు. ఈ క్రమంలో కోర్టు అతడికి తొలుత రూ. 25 వేల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.అయితే ఫైన్ చెల్లించేందుకు ద్వివేది నిరాకరించాడు.
అంతటితో ఆగకుండా న్యాయమూర్తితో వాదనకు దిగాడు. సెక్షన్ 336 కేసులో జరిమానా రూ.250గా ఉందని..నేను ఇంటర్నెట్ చూశానని రూల్స్ మాట్లాడాడు. రూ.25 వేలు ఐతే తాను కట్టనని అవసరమైతే జైలుకు పోతానని తెలిపాడు. దీంతో ఆంధేరీ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ సోమవారం ఆయనకు జైలు శిక్ష విధించారు.