Air India: Passenger falls ill; Union Minister, BJP MP onboard come to rescue
mictv telugu

తోటి ప్రయాణికుడికి వైద్యం అందించిన కేంద్ర మంత్రి, ఎంపీ

June 20, 2022

Air India: Passenger falls ill; Union Minister, BJP MP onboard come to rescue\

ఢిల్లీ విమానాశ్రయం నుంచి ఔరంగాబాద్‌కు వెళ్తున్న ఎయిరిండియా విమానంలో ఓ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి విషమించింది. అదే సమయంలో ఆ విమానంలోనే ప్రయాణిస్తున్న బీజేపీ కి చెందిన కేంద్ర మంత్రి , ఎంపీ లు ఆ ప్రయాణికుడికి ప్రథమ చికిత్స చేశారు.

ఆ రాజకీయ నాయకులిద్దరూ వృత్తిరీత్యా డాక్టర్లే కావడంతో, ఓ పేషెంట్ ను ఆ పరిస్థితిలో చూసి, కష్టకాలంలో ఇద్దరూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారని ఈ మేరకు ఎయిర్ ఇండియా ట్వీట్ చేసింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కిషన్‌రావ్ కరద్, ఎంపీ డాక్టర్ సుభాష్ భామ్రే.. ప్రయాణికుడి దగ్గర నిలబడి అతనికి చికిత్స చేస్తున్న‌ట్టు ఫొటో ప్రస్తుతం వైర‌ల్ అవుతోంది. ప్రస్తుతం ఆ ప్రయాణికుడి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని సమాచారం.