ప్రపంచ విమానయాన చరిత్రలోనే నిలిపిపోయే ప్రకటన చేసింది ఎయిరిండియా. టాటా సన్స్ కు చెందిన ఎయిరిండియా 250 ఎయిర్ బస్ విమానాలు, 220బోయింగ్ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. దీంతో ఎయిరిండియా ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద విమానాల కొనుగోలు ఒప్పందంగా నిలిచిపోనుంది. మొత్తం కొనుగోళ్ల విలువ రూ. 11లక్షల కోట్లు. ఇందులో ఫ్రాన్స్‌కు చెందిన ఎయిర్‌బస్ కు 8.2లక్షల కోట్లు, అమెరికా బోయింగ్ కు 2.7లక్షల కోట్లను చెల్లించనుంది ఎయిరిండియా. కాగా 2005 తర్వాత ఇప్పటివరకు ఎయిరిండియా ఒక్క విమానాన్ని కూడా కొనుగోలు చేయలేదు. కానీ టాటా ఇప్పుడు పెద్దెత్తున కొనుగోలు చేస్తోంది.
Air India to purchase 220 Boeing aircraft, US President Joe Biden hails it as a "historic agreement" pic.twitter.com/ahLCs3r9Ig
— ANI (@ANI) February 14, 2023
కాగా భారత్ త్వరలోనే ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద మార్కెట్ గా అవతరించే అవకాశం ఉంది. రానున్న 15ఏళ్లలో భారత్ కు 2000వేల విమానాలు అవసరమని ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే టాటా గ్రూపు ఈ మధ్యే ప్రభుత్వ యాజమాన్యంలోని ఎయిరిండియాను కొనుగోలు చేసింది. విమాన సర్వీసుల విస్తరణలో భాగంగా ఎయిర్ బస్ కంపెనీ నుంచి 470 విమానాలు కొనుగోలు చేయాలని టాటా నిర్ణయించింది. ఫ్రాన్స్ కు చెందిన ఎయిర్ బస్ తో ఎయిరిండియా చీఫ్ ఎన్ . చంద్రశేఖరన్ ఒప్పందం కుదుర్చుకున్నారు. 17 ఏళ్ల తర్వాత ఎయిరిండియా విమానాల కొనుగోలు ఒప్పందాలపై సంతకాలు చేయడం ఇదే మొదటిసారి. 2005లో బోయింగ్ నుంచి 68 విమానాలు, ఎయిర్ బస్ నుంచి 43 విమానాలతోపాటు 111విమానాలు కొనుగోలు చేసేందుకు ఎయిరిండియా ఈ ఒప్పందాన్ని కుర్చుకుంది. కాగా ఎయిరిండియా వద్ద ప్రస్తుతం 113 విమానాలు మాత్రమే ఉన్నాయి.