థాయ్ లాండ్ లో జనాలు అల్లల్లాడిపోతున్నారు. అక్కడి గాలిలో కాలుష్యం కారణంగా లక్షల మంది అనారోగ్యం పాలవుతున్నారు. రోజురోజుకూ దిగజారుతున్న గాలి నాణ్యత అక్కడ ఆందోళనకరంగా ఉంది. సుమారు 13 లక్షల మంది అస్వస్థతకు గరయ్యారు. అందులో 2 లక్షల మంది ఆస్పత్రిలో చేరే పరిస్థితి. దీనితంటకీ కారణం వాహన కాలుష్యం, పంట వ్యర్ధాలను తగలబెట్టడం వల్ల వచ్చే పొగే కరణాలు అని చెబుతోంది క్కడి ప్రభుత్వం.
కొన్నిరోజులు ప్రజలను బయటకు రావొద్దని చెబుతోంది థాయ్ లాండ్ ప్రభుత్వం. బ్యాంకాక్, దాని చుట్టుపక్కల 50 జిల్లాల్లో గాలిలో పీఎం స్థాయిలు గణనీయంగా పడిపోయాయి. అతి తక్కువగా 2.5 స్థాయిలు నమోదయ్యాయి. గాలిలో ఉండే థూళి కణాలు మనుషుల రక్తంలో కలిసిపోయాయి ఆరోగ్యాన్ని పాడుచేస్తున్నాయి. బాడీ పార్ట్స్ ను దెబ్బతీస్తున్నాయి. అందుకే అక్కడి ప్రజలను ఇంటి నుంచే పనిచేయాలని, బయటకు వస్తే మాస్కులు తప్పనిసరిగా ధరించాలని సూచించింది అక్కడి ప్రభుత్వం. పిల్లలను కూడా స్కూల్స్ కు పంపించొద్దని చెబుతోంది. స్కూల్స్, పార్క్ లలో నో డస్ట్ రూమ్ పేరుతో ఎయిర్ ఫ్యూరిఫైయర్స్ ను ఏర్పాటు చేసింది ఆరోగ్యశాఖ.
బ్యాంకాక్ తో పాటు చియాంగ్ మై సిటీలో ఈ వాయు కాలుష్యం ఎక్కువగానే ఉంది. పంటలు అయిపోయిన తర్వాత మిగినదాన్ని తగలబెట్టడం వల్లనే ఇదంతా జరుగుతోంది అంటోంది ప్రభుత్వం. బ్యాంకాక్, చియాంగ్ మై లో ప్రధాన వృత్తి వ్యవసాయం.