‘గాలి’ హంతకుడు దొరికాడు.. - MicTv.in - Telugu News
mictv telugu

‘గాలి’ హంతకుడు దొరికాడు..

December 2, 2017

కారు కనిపిస్తే చాలు టైర్లు పంక్చర్లు చూస్తూ చాలా ఏళ్లుగా ప్రాన్స్ పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్న దొంగ దొరికాడు. పకడ్బందీగా గాలి పీకేసే ఈ సూదిగాడిని  ఓ ఒక వ్యక్తి ఫొటో తీసి పోలీసులుకు ఉప్పందించడంతో చెక్ పడింది. ఫ్రాన్స్‌లోని బోర్డాక్స్‌ నగరంలో పోలీసులు ఇతణ్ని బుధవారం వలపన్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు 2011 నుంచి రోజుకు 70 కార్లకు గాలి తీసేవాడు. ఆ లెక్కన ఇతగాడి దాడికి 6 వేల కార్లు బలయినట్లు లెక్క.ఇతనిపై దాదాపు 1100 కేసులు ఉన్నాయి. చిన్నప్పుడు సమాజం తనపై చూపిన వివక్ష, ఆర్థిక వ్యత్యాసాలపై ఆగ్రహంగా ఉండేదని, అందుకే గాలిపై దాడి చేస్తున్నానని అతడు చెప్పడంతో పోలీసులు నోరెళ్లబెట్టారు. ఇతడు తనకు తాను ‘సీరియల్ పంక్చరర్’ అని బడాయిగా పేరు పెట్టుకున్నాడు. రాత్రి 2 నుంచి 5 గంటలమధ్య దాడిచేసే ఇతణ్ని ఓ స్థానికుడు ఫోటో తీసి, పోలీసులకు ఇవ్వడంతో గుట్టురట్టయింది. ఇతడు ఏరోజుకు ఆ రోజు తాను చేయాల్సిన పంక్చర్ల గురించి షెడ్యూలు వేసుకుని మరే గాలి తీసేవాడట.  సమాజంపై ద్వేషంతోపాటు ఒంటరితనం వల్ల కూడా అతడు ఇలా ‘గాలి’పై పగతీర్చుకుంటున్నాడు.