విమానం కరోనా! పైలెట్ ఎక్కడి నుంచి దిగాడంటే (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

విమానం కరోనా! పైలెట్ ఎక్కడి నుంచి దిగాడంటే (వీడియో)

March 23, 2020

bgvf

కరోనా బాధితులను చూసి కంగారుపడి దూరంగా పరుగెత్తుతున్నారు. కరోనా అనుమానితుడు విమానంలో ఉన్నాడని తెలిసి ఓ పైలట్ తెగ కంగారుపడిపోయాడు. తనకు ఎక్కడ వైరస్ సోకుతుందనే భయంతో కాక్‌పిట్ కిటికీలోంచి దూకి పరారయ్యాడు. ఈ ఘటన శుక్రవారం ఢిల్లీ విమానశ్రయంలోని పూణె నుంచి ఢిల్లీ వచ్చిన ఎయిర్ ఏషియా విమానంలో చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తాలూకు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ ఘటనపై ఎయిర్ ఏసియా అధికారులు స్పందించారు. విమానం మొదటి వరుసలో కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులు కూర్చున్నట్టు తమకు సమాచారం అందిందని తెలిపారు.  వారికి పరీక్షలు నిర్వహిస్తే నెగిటివ్‌ అని తేలిందని చెప్పారు. ‘ముందు జాగ్రత్త చర్యగా ఆ విమానాన్ని రిమోట్‌ బే వద్ద నిలిపాం. కరోనా లక్షణాలు ఉన్న ప్రయాణికులు ముందు ద్వారం నుంచి దిగారు. మిగతా ప్రయాణికులను సిబ్బంది సాయంతో వెనుక ద్వారం నుంచి బయటికి తీసుకొచ్చాం. ముందు డోర్ నుంచి ప్రయాణికులు బయటికి వచ్చేంతవరకు కాక్‌పిట్‌లో ఉన్న సిబ్బంది స్వీయ నిర్బంధంలో ఉన్నారు. తర్వాత కెప్టెన్ సురక్షిత పద్ధతిలో రెండో ద్వారం నుంచి కిందికి దిగారు. అనంతరం విమానాన్ని పూర్తిగా శుభ్రం చేశాం’ అని అధికారులు వెల్లడించారు.