కారు ప్రమాద సమయాల్లో ఎయిర్ బ్యాగులు తెరుచుకుని ప్రాణాలు కాపాడతాయి. ఇప్పటివరకు వరకు కార్లకు మాత్రమే పరిమితమైన ఈ బ్యాగులు మోటార్ సైకిళ్లు నడిపే వారికి కూడా అందుబాటులోకి రానున్నాయి. దీంతో రోడ్డు మరణాలు భారీగా తగ్గే అవకాశముంది.
బైకర్లు ప్రమాదాల నుంచి సురక్షితంగా తప్పించుకోడానికి పరిశోధకులు ఎయిర్‌బ్యాగ్ జీన్స్‌ను తయారు చేస్తున్నారు. స్వీడన్‌కు చెందిన ఎయిర్ బ్యాగ్ ఇన్సైడ్ స్వీడన్ ఏబీ అనే కంపెనీ వీటిని రూపొందిస్తోంది. సెస్ షహ్రీవర్ అనే పరిశోధకుడు హార్లే-డేవిడ్సన్ కంపెనీతో కలిసి ఈ బ్యాగ్స్‌కు రూపకల్పన చేశాడు. ఈ ఎయిర్ బ్యాగ్ జీన్స్‌ను ధరిస్తే ప్రమాదం జరిగినప్పుడు అవి తెరుచుకుని ప్రాణాలు కాపాడతాయి. ప్యాంట్లలోకి గాలి వెళ్లి ఉబ్బడం వల్ల మన శరీరానికి దెబ్బలు తగలవు. ఛాతీ, మెడ, పొట్టకు గాయాలు కావు. హెల్మెట్ కూడా ఉంటుంది కనుక మొత్తం శరీరానికంతా రక్షణ కలుగుతుంది ఈ జీన్స్‌కు యూరోపియన్ హెల్త్ స్టాండర్ట్స్ అనుమతి ఇవ్వాల్సి ఉంది. 2022 సంవత్సరంలో ఇవి మార్కెట్లోకి వచ్చే అవకాశముంది. ఈ జీన్స్‌కు జీపీఎస్, గైరోస్కోప్, యాక్సిలెరోమీటర్ తదితరాలను జత చేస్తారు. జీన్స్ ధర 20 నుంచి 30 వేల వరకు ఉండొచ్చని అంచనా.