శిక్షణ విమానం కూలి పైలెట్ మృతి  - MicTv.in - Telugu News
mictv telugu

శిక్షణ విమానం కూలి పైలెట్ మృతి 

September 21, 2020

 Aircraft Flown in Uttar Pradesh

మన దేశంలో శిక్షణ విమానాలకు భద్రత లేకుండా పోతోంది. తరుచూ ఏదో ఒక చోట ఎయిర్ క్రాఫ్ట్‌లు కూలిపోయి శిక్షణలో ఉన్నవారు ప్రమాదాల బారిన పడుతూనే ఉన్నారు. కొన్నిసార్లు యువ పైలెట్లు ప్రాణాలు కొల్పోతుండగా.. మరికొందరు తృటిలో తప్పించుకుంటున్నారు. తాజాగా యూపీలోనూ ఇలాంటిదే చోటు చేసుకుంది. సోమవారం ఉదయం 11.20 గంటల సమయంలో శిక్షణ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా మిగిలిన వారంతా ప్రాణాలతో బయటపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది.   

ఇందిరా గాంధీ రాష్ట్రీయ యురాన్ అకాడమీ నుంచి శిక్షణ తీసుకుంటున్న నలుగురు పైలెట్లతో టి.బి 20 విమానం బయలుదేరింది. కొంతసేపటి తర్వాత అజమ్‌గఢ్ జిల్లాలోని కుశ్వాపురవా గ్రామంలో పంట పొలాల్లో కుప్పకూలింది.  భారీ శబ్ధం రావడంతో గ్రామస్తులు ఈ విషయాన్ని అధికారులకు చేరవేశారు. వెంటనే శిథలాల కింద చిక్కుకుపోయిన మృతదేహాన్ని బయటకు తీశారు. ప్రమాద సమయంలో ఇద్దరు పైలెట్లు ప్యారాచూట్ వేసుకొని కిందకు దిగి ప్రాణాలు కాపాడుకోగా.. మరో వ్యక్తి గల్లంతు అయ్యారు. అతని కోసం అధికారులు గాలిస్తున్నారు.