విమానంలో వ్యభిచారం.. ధరలో నో బార్గెయిన్ - MicTv.in - Telugu News
mictv telugu

విమానంలో వ్యభిచారం.. ధరలో నో బార్గెయిన్

December 1, 2020

airr

అవకాశం దొరికితే ఆకాశాన్ని కూడా అమ్మేసుకునే పాడు లోకం ఇది. అలాంటిది, ఆకాశంలో ఎగిరే విమానంలో సైడ్ బిజినెస్ చేసే అవకాశం దొరికితే వదులుకుంటారా? అస్సలు వదలుకోరు. ఓ ఎయిర్ హోస్టెస్‌కు ఈ సంగతి బాగా తెలుసేమో.. ఏకంగా విమానంలో వ్యభిచారానికి తెరలేపింది. 

‘విమానంలో శృంగారం కావాలా? అయితే నన్ను సంప్రదించండి.. నా ఫోటోలు చూడండి.. డబ్బులు పంపండి, డీల్ కుదుర్చుకోండి… ’ అంటూ సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తోంది. ‘మీరు ముందుగా కలవాలనుకుంటే 5 వేల రూపాయలు చెల్లించాలి. మనం కలుసుకునే ప్రదేశాన్ని బట్టి కూడా ధరలు మారుతుంటాయి. ఇందులో ఎలాంటి బేరసారాలకూ చోటు లేదు…’ అని నిక్కచ్చిగా చెబుతోంది. విమానంలో రెచ్చగొట్టేలా ఉన్న భంగిమలతో తీయించుకున్న ఫోటోలను కూడా షేర్ చేస్తోంది. అంతేకాదండోయ్.. తాను ధరించిన అండర్‌వేర్లను కూడా తక్కువ ధరలకు అమ్ముతానని ఆఫర్ ఇస్తోంది.  ఒక్కో చెడ్డీ ధర 2500 మాత్రమేనట. 

బ్రిటిష్ ఎయిర్‌వేస్‌లో పనిచేస్తున్న ఆ ముద్దుగుమ్మ తతంగం బయటికి రావడంతో అటు కంపెనీ, ఇటు ప్యాసింజర్లు అవాక్కయ్యారు. ఆమె విమానంలో వ్యవభిచారం ఎన్నాళ్లుగా సాగిస్తోందని విచారణ ప్రారంభించారు. ప్యాసింజర్లు ఇలాంటి ప్రలోభాలకు గురికావొద్దని, విమానాల్లో వ్యభిచారం చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని బ్రిటిష్ ఎయిర్‌వేస్ హెచ్చరించింది.