హైవేపైకి దూసుకొచ్చిన భారీ విమానం - MicTv.in - Telugu News
mictv telugu

హైవేపైకి దూసుకొచ్చిన భారీ విమానం

January 27, 2020

Iran

ఇరాన్‌లోని కుజెస్థాన్ ప్రావిన్స్‌లో సోమవారం ఓ విమానానికి పెను ప్రమాదం తప్పింది. 135మంది ప్రయాణికులతో వెళ్తోన్న కాస్పియన్ ఎయిర్‌లైన్‌కు చెందిన విమానం ప్రమాదవశాత్తు హైవే రోడ్డుపైకి దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన సమయంలో ఆ విమానం టెహ్రాన్ నుంచి మహ్‌షహర్ విమానాశ్రయానికి బయలుదేరింది. 

విమానం రోడ్డుపైకి రావడంతో ఆ ప్రాంతంలో ట్రాఫిక్ జామ్ అయ్యింది. విమానంలో ప్రయాణిస్తున్న వారికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ప్రయాణికులంతా కాక్ పిట్ దగ్గర ఉన్న తలుపు తెరుచుకుని సురక్షితంగా బయటపడ్డారు. విమానం రోడ్డుపైకి రావడంతో వెంటనే స్పందించిన అధికారులు..ఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన సమాచారాన్ని ఎయిర్‌లైన్ సిబ్బందిని అడిగి తెలుసుకుంటున్నారు. కాగా, విమానం హైవేకి దూసుకు వచ్చిన ఫొటోలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.