కరోనా కలకలం.. హాంకాంగ్‌కు ఎయిరిండియా విమానాలు రద్దు - MicTv.in - Telugu News
mictv telugu

కరోనా కలకలం.. హాంకాంగ్‌కు ఎయిరిండియా విమానాలు రద్దు

February 4, 2020

vbg

కరోనా వైరస్ భయం ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తోంది. చైనా ఎవరు వేరే దేశాలకు వెళ్లినా వైద్య పరీక్షలు చేస్తున్నారు. చైనాకు ఇతర దేశాలకు ప్రయాణికుల రాకపోకలు కూడా బాగా తగ్గిపోయాయి. అక్కడున్న తమవారిని స్వదేశాలకు రప్పించాలని వారి వారి బంధువులు ఆయా రాష్ట్ర, దేశ ప్రభుత్వాలను విన్నవించుకుంటున్నారు. ఇప్పటికే అక్కడ ఉన్న భారత విద్యార్థులను కేంద్రం రప్పించి ఢిల్లీ సమీపంలోని మనేసర్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేంద్రంలో వసతి కల్పించిన విషయం తెలిసిందే. అదేవిధంగా ఆర్మీ క్యాంపులో ప్రత్యేక వైద్య పరీక్షల నిర్వహించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.  

ఇదిలావుండగా భారత ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియా హాంకాంగ్‌కు విమాన సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించింది. ఫిబ్రవరిన 8 నుంచి హాంకాంగ్‌కు విమానాలు నడపరాదని నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7న హాంకాంగ్‌కు వెళ్లే ఏఐ314 సర్వీసే ఎయిరిండియా నడిపే చివరి సర్వీసు కానుందని తెలిపింది. కాగా, ఇప్పటికే పలు విమానయాన సంస్థలకు చైనా, దాని పొరుగున ఉన్న తైవాన్, హాంకాంగ్‌లకు విమాన సర్వీసులను తగ్గించాయి.