airplane wing transported truck hits to rtc bus in kerala
mictv telugu

విమానం రెక్క తగిలి ఆర్టీసీ బస్సు ధ్వంసం.. డ్రైవరు సహా పలువురికి గాయాలు

November 3, 2022

విమానం రెక్కలు తగిలి కేఆస్ఆర్టీసీ బస్సు ధ్వంసం అయింది. కేరళ రాజధాని తిరువనంతపురం సమీపంలోని బలరామపురంలో బుధవారం రాత్రి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో విమానం లేదు కానీ, విమానం రెక్క తగిలింది. నాలుగేళ్ల క్రితం షెడ్డులో పడేసిన ఎయిర్ బస్ అనే విమానం రెక్కను ఓ ట్రక్కులో జాతీయ రహదారిపై తరలిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో బస్సు ముందు పక్క కుడి భాగం పూర్తిగా ధ్వంసమవగా, డ్రైవరుతో పాటు పలువురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారిని సమీపంలోని ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. అటు ప్రమాదానికి కారణమైన ట్రక్కు డ్రైవర్ వాహనాన్ని అక్కడే వదిలేసి పరారయ్యాడు. దీంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దీని వల్ల కొన్ని గంటల పాటు అధికారులు రహదారిని మూసివేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.