దీపావళికి ఎయిర్ టెల్ 4జీ ఫోన్  - MicTv.in - Telugu News
mictv telugu

దీపావళికి ఎయిర్ టెల్ 4జీ ఫోన్ 

September 11, 2017

4జీ నెట్ వర్క్ వచ్చినంక 4జీ స్మార్ట్ ఫోన్లకు బాగనే గిరాకి పెరిగింది. అవ్ మరి 4జీ అంటే మామూలు స్పీడా? నిమిషాలల్ల సినిమా డౌన్లోడ్ చేస్కోవచ్చు. బ్రౌజింగ్ గుడ స్పీడ్ అయితది. అయితే మార్కెట్ల 4జీ ఫోన్లకున్న  డిమాండ్ ని దృష్టిల పెట్టుకొని  ఏయిర్ టెల్ దీపావళికి  కొత్త స్మార్ట్ ఫోన్ ను మార్కెట్లకు తీస్కస్తుంది.కేవలం  రెండు వేల ఐదువందలకే 4జీ స్మార్ట్ ఫోన్ ను అమ్ముతరట.ఇప్పటికే హ్యాండ్ సెట్ కంపెనీలతో చర్చలు పూర్తయ్యాయని.. కస్టమర్లకు అందించటానికి సిద్ధంగా ఉన్నారని కూడా వెల్లడించింది ఎయిర్ టెల్. ప్యాకేజీ కూడా అతి తక్కువగా ఉంటుందని.. ఎయిర్ టెల్ ఫోన్ లో కాల్స్ ఉచితం.. డేటాకి మాత్రమే ఛార్జ్ వసూలు చేస్తామని తెలిపింది. అక్టోబర్ 19వ తేదీ దీపావళికి విడుదల అవుతుంది ఈ ఫోన్.

ఎయిర్ టెల్ 4జీ ఫోన్ ఫీచర్స్ ఇవే :

1జీబీ ర్యామ్,  స్క్రీన్ నాలుగు అంగుళాలు, టచ్ స్ర్కీన్, LoLTE  సదుపాయం, ఆండ్రాయ్ ఓఎస్, డ్యుయెల్ కెమెరా, బ్యాటరీ లైఫ్ మరింత ఎక్కువగా ఉండే విధంగా మొబైల్ తయారవుతుంది.