ఎయిర్‌టెల్ శుభవార్త.. ఔట్ గోయింగ్ కాల్స్‌ అపరిమితం  - MicTv.in - Telugu News
mictv telugu

ఎయిర్‌టెల్ శుభవార్త.. ఔట్ గోయింగ్ కాల్స్‌ అపరిమితం 

December 7, 2019

Airtel calls unlimited 

దేశీయ టెలికం కంపెనీలు పోటీని తట్టుకోడానికి ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. రిలయన్స్ జియో నుంచి పోటీ ఎదుర్కొంటున్న ఎయిర్‌టెల్ యూజర్లకు శుభవార్త చెప్పింది. తన ప్రీపెయిడ్ యూజర్లకు ఔట్ గోయింగ్ కాల్స్ పై పెట్టిన పరిమితులను ఎత్తేసింది. డిసెంబర్‌ 3 నుంచి ప్రవేశపెట్టిన కొత్త పాన్లలో ఈ మార్పులు చేసింది. 

నష్టాల నేపథ్యంలో ఎయిర్‌టెల్ ప్రీపెయిడ్‌ ప్లాన్ల ధరలను ఇటీవలే 50 శాతం వరకు పెంచి కొత్త అన్ లిమిటెడ్ ప్లాన్లు తీసుకొచ్చింది.  28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 1000 నిమిషాలు, 84 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌కు 3వేలు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్‌పై 12వేల నిమిషాల పరిమితి  పెట్టింది. ఆ పరిమితి దాటికే ఇతర నెట్‌వర్క్‌కు చేసే కాల్స్‌కు నిమిషానికి ఆరు పైసలు చార్జీ పడుతుంది. దీనిపై యూజర్లు ఆందోళన వ్యక్తం చేయడంతో పరిమితిని ఎత్తేసింది.  శనివారం నుంచి తమ యూజర్లు ఏ ఇతర నెట్ వర్క్‌కు అయినా ఎంతసేపైనా మట్లాడుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నిర్ణయంతో జియో, వొడాఫోన్ ఐడియాలు కూడా కాల్స్‌పై పరిమితులను ఎత్తేసే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.