ప్రముఖ టెలికం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ కంపెనీకి ఈ ఏడాది కష్టకాలన్ని తెచ్చిపెట్టింది. చివరి త్రైమాసికంలో భారీగా నష్టాలను మూటగట్టుకుంది. మార్చితో ముగిసిన క్వార్టర్‌కు రూ.5,237 కోట్ల నికర నష్టాలు వచ్చాయని ఆ సంస్థ వెల్లడించింది. గత ఏడాది మార్చిలో లాభాల బాటపట్టిన ఈ సంస్థ ఇప్పుడు నష్టాల ఊబిలోకి వెళ్లడం విశేషం. దీనికి కారణం వన్‌టైమ్ స్పెక్ట్రమ్ చార్జీల చెల్లింపు తీర్పు కారణమని ఈ సంస్థ అభిప్రాయపడింది.
స్పెక్ట్రం చెల్లింపుల బకీయాలను చెల్లించాలంటూ సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఎయిర్ టెల్ ఈసారి రూ.7,004 కోట్లు చెల్లించాల్సి వచ్చింది. దీంతో రాబడి తగ్గిపోవాల్సి వచ్చింది. కాగా గత ఏడాది మార్చి క్వార్టర్లో రూ.107 కోట్ల నికర లాభం రాగా.. ఈ ఏడాది మాత్రం రూ.5,237 కోట్ల నష్టం వాటిల్లింది. ఈ కంపెనీ గత ఏడాది డిసెంబర్లో టెలికం సేవల ధరలను పెంచింది. దీంతో ప్రతి వినియోగదారు నుంచి త్రైమాసిక సగటు ఆదాయం 25% పెరిగి 154 రూపాయలకు చేరుకుంది. దీంతో మార్చి 31 తో ముగిసిన త్రైమాసికంలో మొత్తం ఆదాయం 15% పెరిగి 237.23 బిలియన్ రూపాయలకు చేరుకుంది. కానీ నష్టాలను మాత్రం మూటగట్టుకోక తప్పలేదు.