అమితాబ్ కుటుంబానికి సోకిన కరోనా.. ఐశ్యర్య, ఆరాధ్యలకూ పాజిటివ్.. - MicTv.in - Telugu News
mictv telugu

అమితాబ్ కుటుంబానికి సోకిన కరోనా.. ఐశ్యర్య, ఆరాధ్యలకూ పాజిటివ్..

July 12, 2020

Aishwarya Rai

మహమ్మారి కరోనా వైరస్ బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కుటుంబాన్ని మొత్తం టార్గెట్ చేసినట్టుంది. ఇప్పటికే అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు నటుడు అభిషేక్ బచ్చన్‌కు కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వారిద్దరూ ముంబై నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలావుండగా అభిషేక్ బచ్చన్ భార్య ఐశ్వర్యా రాయ్, కుమార్తె ఆరాధ్యలకు కూడా కరోనా సోకింది. వారికి రెండుసార్లు నిర్వహించిన పరీక్షల్లో నెగెటివ్ రిపోర్టు వచ్చింది. మూడో దఫా నిర్వహించిన పరీక్షలు పాజిటివ్‌గా తేలాయి. దీంతో బాలీవుడ్‌లో ఒక్కసారిగా కలకలం రేగింది. ఐశ్వర్యా రాయ్, ఆరాధ్యలకు కరోనా సోకినట్లు వైద్యులు వెల్లడించారు. అమితాబ్ సతీమణి జయా బచ్చన్‌కు నెగెటివ్ వచ్చిందని తెలిపారు. ఈ విషయాన్ని మహారాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి రాజేష్ తోపే ధృవీకరించారు. 

బచ్చన్ కుటుంబం కరోనా నుంచి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్లు రాజేష్ తోపే కోరుకున్నారు. దీంతో బచ్చన్ కుటుంబంలో మొత్తం నలుగురికి కరోనా వైరస్ సోకినట్టయింది. కాగా, అమితాబ్ బచ్చన్, ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్‌ కరోనా వైరస్ బారిన పడినట్టు తెలిసిన వెంటనే దేశవ్యాప్తంగా అభిమానులు ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని ప్రఖ్యాత ఉజ్జయినీ మహకాళేశ్వరుడి ఆలయంలో ప్రత్యేకంగా హోమాన్ని జరిపించారు. బాలీవుడ్‌ ప్రముఖులంతా అమతాబ్ కుటుంబం త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని కోరుతున్నారు.