వేశ్య బయోపిక్‌లో ఐశ్వర్య రాయ్! - MicTv.in - Telugu News
mictv telugu

వేశ్య బయోపిక్‌లో ఐశ్వర్య రాయ్!

January 22, 2020

bnhn

ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ బచ్చన్ మరోసారి సంచలన పాత్ర చేయడానికి ఓకే చెప్పిందని సమాచారం. వేశ్య నుంచి రంగస్థల నటిగా మారి ఆ తర్వాత గాయనిగా ఎదిగిన బినోదిని దాసి బయోపిక్‌లో ఐశ్వర్య నటించబోతున్నట్టు తెలుస్తోంది. 19వ శతాబ్దంలో బెంగాల్‌కు చెందిన వేశ్య బినోదిని… రంగస్థల నటిగా మారి ఆ తరువాత నాటకాల్లో విభిన్నమైన పాత్రలు పోషించారు. తరువాత గాయనిగా మారిన ఆమె ప్రస్థానం ఎంతో మందికి ఆదర్శం. 

ఇప్పుడు ఈమె జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ప్రదీప్ సర్కార్ ఓ సినిమాను తెరకెక్కించబోతున్నాడు. ఈ చిత్రంలో బినోదిని పాత్రలో ఐశ్వర్య నటించనుంది. ముందుగా ఈ పాత్ర కోసం దీపికా పదుకొన్‌ను ఎంపిక చేశారు. కానీ, వివిధ కారణాల వలన దీపిక ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించలేదు. ఐశ్వర్యను సంప్రదించగా ఆమె కథను విని చేసేందుకు ఆసక్తి చూపించినట్టు దర్శకుడు సర్కార్ తెలిపాడు. త్వరలో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఐశ్వర్యా రాయ్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో ముఖ్యపాత్రలో నటిస్తోంది.