మోహ‌న్ బాబుకు భార్య‌గా ఐశ్వర్యా రాయ్! - MicTv.in - Telugu News
mictv telugu

మోహ‌న్ బాబుకు భార్య‌గా ఐశ్వర్యా రాయ్!

May 17, 2019

ఐశ్వ‌ర్య‌రాయ్ నాలుగోసారి ప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించడానికి సిద్దమైనది. కల్కి రచించిన ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ పుస్తకం ఆధారంగా మణిరత్నం రూపొందించనున్న చిత్రంలో ఆమె న‌టించ‌నున్న‌ట్టు సమాచారం. నందిని అనే పాత్ర కోసం ఐశ్వర్యరాయ్‌ని మ‌ణిర‌త్నం సంప్ర‌దించాడని, అందుకు ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని తెలుస్తోంది.

Aishwarya Rai Bachchan to Play a Power-Hungry, Manipulative Woman in Mani Ratnam’s Film.

అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం ఆమె ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌క పాత్ర‌లో నటించనుందట. ఈ పాత్ర రాజ్యాధికారం మీద మక్కువతో ద్రోహానికి పాల్పడేదిగా ఉండనుందట. చిత్రంలో మోహ‌న్ బాబు కూడా కీల‌క పాత్ర పోషిస్తుండ‌గా, ఆయ‌న భార్య‌గా ఐశ్వర్య క‌నిపించ‌నుంద‌ని తెలుస్తుంది. మద్రాస్ టాకీస్, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ కలిసి నిర్మిస్తున్న ఈ చారిత్రాత్మ‌క చిత్రంలో జయం రవి, విక్రమ్, అనుష్క, కీర్తి సురేష్, విజయ్ సేతుపతిలు కూడా నటించనున్నారు. ఐశ్వర్యరాయ్ చివ‌రగా ఫన్నేఖాన్ అనే సినిమాతో ప్రేక్ష‌కుల‌ని ప‌ల‌కరించింది. ఆమె మణిరత్నం తెరకెక్కించిన ఇద్దరు చిత్రం ద్వారా వెండితెరకు పరిచయం అయిన సంగతి తెలిసందే. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో గురు, విలన్ చిత్రాల్లో నటించింది.