ఫొటోలు తీయొద్దంటూ.. ఏడ్చేసిన ఐశ్వర్య - MicTv.in - Telugu News
mictv telugu

ఫొటోలు తీయొద్దంటూ.. ఏడ్చేసిన ఐశ్వర్య

November 21, 2017

ఎంత సెలబ్రిటీలైనా వారికీ వ్యక్తిగత జీవితం ఉంటుంది. మీడియా దీన్ని దృష్టిలో ఉంచుకోకుంటే తీవ్ర విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. బాలీవుడ్ నటి ఐశ్వర్యా రాయ్ విషయంలో ఇదే జరిగింది. ఐశ్వర్య తన తండ్రి కృష్ణరాజ్ రాయ్ జయంతి సందర్భంగా ముంబైలో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమం దీనికి వేదికైంది.తండ్రి సంస్మరణార్థం ఐశ్వర్య ముంబైకి చెందిన స్మైల్‌ ఫౌండేషన్‌ ద్వారా గ్రహణం మొర్రికి గురైన 100 మంది బాలలకు సర్జరీ చేయించారు. తర్వాత వారితో కలసి సరదాగా గడిపారు. వారితో కలసి తన తండ్రి జయంతి సందర్భంగా కేక్ కట్ చేశారు. అయితే ఈ సంగతి తెలుసుకున్న మీడియా వారు అక్కడికి చొరబడ్డారు. ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. దీంతో ఐశ్వర్య భావోద్వేగానికి గరైంది. ‘‘ప్లీజ్.. నన్ను వొదిలేయండి… ఫొటోలు తీయకండి.. ఇది పూర్తిగా నా వ్యక్తిగత కార్యక్రమం.. అసలు నేను ఇక్కడికి ఎందుకొచ్చానో మీకు తెలీదు…ఇదేమీ  సినిమా ప్రీమియర్‌ షో కాదు. బహిరంగ కార్యక్రమం అంతకంటే కాదు.. మీ ప్రవర్తన బాగాలేదు.. మీరేం చేస్తున్నారో మీకు తెలుస్తోందా… ’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు.