అజిత్ పవార్‌కు క్లీన్‌చిట్..! ఏ - MicTv.in - Telugu News
mictv telugu

అజిత్ పవార్‌కు క్లీన్‌చిట్..! ఏ

November 25, 2019

Ajit pawar clean chit in irrigation case 

మహారాష్ట్ర రాజకీయాలు మహా ట్విస్టులతో కొనసాగుతున్నాయి. ఎన్సీపీ చీలిక వర్గం నేత అజిత్ పవార్‌కు ఓ భారీ అవినీతి కేసులో ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చేసినట్లు వార్తలు వస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వీలుగా మద్దతిచ్చి, తాను డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేసిన రెండు రోజులకే ఆయన పరిశుద్ధ మనిషిగా బయటికి వచ్చారనడం రాజకీయ నిపుణులను విస్మయపరుస్తోంది. 

రూ.70వేల కోట్ల నీటిపారుదల కుంభకోణంలో నిందితుల్లో అజిత్ నిందితుడు. ఆయన పాత్రమీ లేదంటూ ఏసీబీ కేసును మూసేసినట్లు కొన్ని పత్రికలు తెలిపాయి. అయితే అలాంటిదేమీ లేదని ఏసీబీ చెప్పుకొచ్చింది. అజిత్‌పై ఉన్న 9 కేసులు అలాగే ఉన్నాయని ఈ రోజు మూసేసిన కేసులతో ఆయనకు సంబంధం లేదని వివరణ ఇచ్చింది.  అజిత్  1999 – 2014 మధ్య కాంగ్రెస్ – ఎన్సీపీ ప్రభుత్వంలో నీటిపారుదల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో విదర్భ ఇరిగేషన్ పథకం అమలైంది. అందులో అజిత్ రూ. 70 వేల కోట్లు అవినీతికి పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. గత ఏడాది బీజేపీ ప్రభుత్వ ఆదేశంతో ఏసీబీ దర్యాప్తు చేసింది. అతణ్ని ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తామని అప్పటి కేంద్ర మంత్రి రావ్ సాహేబ్ ధన్వే కూడా హెచ్చరికలు జారీ చేశారు.