మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్..అజిత్ పవార్ రాజీనామా.! - MicTv.in - Telugu News
mictv telugu

మహారాష్ట్రలో ఊహించని ట్విస్ట్..అజిత్ పవార్ రాజీనామా.!

November 26, 2019

మహారాష్ట్ర రాజకీయాల్లో క్షణ క్షణానికి రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ఎవరు ఎటువైపు మద్దతు తెలుపుతున్నారో అర్థంకాని పరిస్థితి నెలకొంది. బలపరీక్ష నేపథ్యంలో ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కునేందుకు బీజేపీ ప్లాన్ వేస్తుండగా కమల దళానికి ఊహించని షాక్ తగిలింది. అజిత్ పవార్ తన డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. దీనికి బలం చేకూర్చే విధంగా శివసేన అధికారిక వెబ్‌సైట్ సామ్నా దీన్ని ధృవీకరిస్తూ ఓ కథనాన్ని రాసింది. దీంతో పవార్ తిరిగి ఎన్సీపీ గూటికి చేరబోతున్నట్టుగా తెలుస్తోంది. 

Ajit Pawar.

అజిత్ ఇటీవల కొంతమంది పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి అధిష్ఠానంపై తిరుగుబాటు చేశారు. ఆ వెంటనే బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిప్యూటీ సీఎంగా ప్రమాణా స్వీకారం చేశారు. అయితే ఆయన వెంట వెళ్లిన శాసన సభ్యులు అంతా తిరిగి శరద్ పవార్ వద్దకు వచ్చారు. దీంతో ఒంటరిగా మిగిలిన అజిత్ పవార్ డైలామాలో పడిపోయారు. శరద్ పవార్ భార్య కూడా అజిత్‌ను తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేందుకు మంత్రాంగం నడిపారు. ఇక సుప్రీం కోర్టు కూడా రేపు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. సంఖ్యాబలంపై అనుమానంతో ఆయన రాజీనామా చేసినట్టుగా తెలుస్తోంది. దీంతో రేపటి బలనిరూపణ డైలామాలో పడిపోయింది.