ప్రముఖ తమిళ సినీనటుడు అజిత్ మరోసారి అపరేషన్ థియేటర్ బెడ్డు ఎక్కారు. తన తాజా యాక్షన్ హిట్ చిత్రం ‘వివేగం’ షూటింగ్ లో ఆయన భుజానికి బలమైన గాయమైంది. యూరప్ లోని బల్గేరియా దేశంలో జరిగిన ఫైటింగ్ సన్నివేశాల్లో ఆయన డూప్ లేకుండా నటించడమే ఇందుకు కారణం. ప్రమాదం తర్వాత ప్రథమ చికిత్స చేయించుకుని ఆ వెంటనే ఆయన షూటింగ్ లో పాల్గొన్నాడు. షూటింగ్ కు ఇబ్బంది రాకుండా ఆయన అలాగే పాల్గొన్నాడు. నెలరోజుల్లోగా సర్జరీ చేయించుకోవాలని, లేకపోతే ప్రమాదమని వైద్యులు హెచ్చరించారు. షూటింగ్ ముగించుకుని ఇంటికొచ్చిన అజిత్ తన ఇంటికే వైద్యులను పిలిపించుకుని చికిత్స చేయించుకుంటున్నారు. ఈ నెల 7వ తేదీని ఆయన ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో సర్జరీ చేయించుకున్నారు. ఆయన రెండు నెలలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సలహా ఇచ్చారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. అజిత్ డూప్ లేకుండా నటించి ఇదివరకు కూడా పలుసార్లు గాయపడ్డారు. సహజత్వం కోసం ఆయన ఇలా చేస్తుంటారు.