అయోధ్య తీర్పును స్వాగతించిన అజ్మేర్ దర్గా - MicTv.in - Telugu News
mictv telugu

అయోధ్య తీర్పును స్వాగతించిన అజ్మేర్ దర్గా

November 9, 2019

సుప్రీం కోర్టు అయోధ్య భూ వివాదంపై ఇచ్చిన తీర్పును ప్రముఖ పుణ్యక్షేత్రం అజ్మేర్ దర్గా స్వాగతించింది.  దశాబ్ధాలుగా నలుగుతూ వస్తున్న అంశం మెజార్టీ ప్రజలకు సంతృప్తిని ఇచ్చే తీర్పు వచ్చిందని దర్గా మత పెద్దలు అభిప్రాయపడ్డారు. తీర్పుకు ప్రతి ఒక్కరు కట్టుబడి ఉండాలని మౌల్వీ దీవాన్ జైనుల్ అబెదిన్ అలీ ఖాన్ సూచించారు.

Ajmer Dargah..

 ‘ప్రస్తుతం ప్రపంచం అంతా భారత్‌‌ను చూస్తోంది. ఈ సమయంలో మనం ఎంత శాంతికాముకులమో తెలియజేయాలి. మన మధ్య ఉన్న సోదర భావాన్ని ప్రపంచ దేశాలకు చాటాలి.ఎవరూ అవాంఛనీయ ఘటనలకు పాల్పడవద్దు. మన మధ్య సోదర భావాన్ని మరింత పెంచేలా న్యామూర్తులు తీర్పునిచ్చారు. చారిత్రాత్మక సాక్షాల ఆధారంగానే ఈ రకమైన తీర్పు వచ్చింది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు సున్నీ వక్ఫ్ బోర్డు అసంతృప్తి వ్యక్తం చేయడంపై కూడా ఆయన స్పందించారు. ఎవరి అభిప్రాయాలు వారివి అంటూ జైనుల్ అబెదిన్ వ్యాఖ్యానించారు.