Akash is the son of singer Sunitha who is making his film debut
mictv telugu

హీరోగా వస్తున్న సింగర్ సునీత కొడుకు.. కూతురు మాత్రం

November 10, 2022

Akash is the son of singer Sunitha who is making his film debut

టాలీవుడ్ సింగర్ సునీత తన గాత్రంతో అనేక పాటలు పాడి పరిశ్రమలో ప్రత్యేక స్థానం సంపాదించింది. సింగర్‌గానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకుంది. గాత్రంతో పాటు అందంతో కూడా ఆకట్టుకునే సునీత.. హీరోయిన్లతో సమానంగా క్రేజ్ తెచ్చుకుంది.

ఇటీవల కాలంలో వ్యాపార వేత్త రామ్ వీరపనేనని రెండో పెళ్లి చేసుకొని వార్తల్లో నిలిచింది. ఈ కాంట్రవర్సీ పక్కన పెడితే ఇప్పుడు ఆమె కుమారుడు ఆకాశ్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కుమారుడి పుట్టినరోజు సందర్భంగా విష్ చేస్తూ.. త్వరలో నిన్ను బిగ్ స్క్రీన్‌‌పై చూడాలనుకుంటున్నానంటూ రెండు ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలు ఇటీవల షూట్ చేసినవని చెప్పడం గమనార్హం. దీంతో ఆకాశ్ త్వరలో సినిమాల్లోకి రాబోతున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఆకాశ్‌‌కు బెస్ట్ విషెశ్ తెలుపుతున్నారు. అయితే సినిమా పేరేంటి? దర్శకుడు ఎవరు వంటి వివరాలు తెలియరాలేదు. కాగా, సునీత తన కూతురు శ్రియాను ఇప్పటికే సింగర్‌‌‌గా పరిచయం చేసిన విషయం తెలిసిందే.