డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘చోర్ బజార్’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యూత్‌ఫుల్ లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రానికి ‘జార్జి రెడ్డి’ ఫేం జీవన్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఆయన ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రులపై వస్తున్న రూమర్లను ఖండించారు. పూరీ జగన్నాథ్, ఆయన భార్య లావణ్య వ్యక్తిగత కారణాల వల్ల విడిపోవాలని నిర్ణయించుకున్నారని ఇటీవల వచ్చిన వార్తలు.. అవాస్తవమని తేల్చేశారు.
ఒకప్పుడు కొన్ని ఆస్తులు పొగొట్టుకున్న తన తండ్రి మళ్ళీ కోలుకున్నాడు అంటే దానికి కారణం తన తల్లే అని చెప్పాడు. నాన్నకి అతిపెద్ద సపోర్ట్ సిస్టం ఆమేనని చెప్పుకొచ్చాడు. అసలు ఈ విడాకుల ప్రచారం వార్తల కోసం ఎవరో రాసి వదిలేదే తప్ప అమ్మానాన్న చాలా హ్యాపీగా ఉన్నారని , ఎలాంటి ఇబ్బందులు లేవని ఆకాశ్ చెప్పుకొచ్చాడు. అమ్మనాన్నల వివాహం జరిగిన సమయంలో మా నాన్న “కేవలం రెండు వందల రూపాయలు నా జేబులో ఉన్నాయి.. నన్ను నమ్మి రాగలవా అని అడిగితే” మా అమ్మ నమ్మి వెళ్లారని చెప్పారు. అలాంటి ఆమె ఇప్పుడు విడాకులు ఇస్తారు అని వార్తలు రావడంతో ఏ మాత్రం కరెక్ట్ గా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తన తండ్రి విషయంలో తను చాలా హ్యాపీగా ఉన్నానని ఆయన పాన్ ఇండియా రేంజ్ కి వెళ్లడం చాలా ఆనందం కలిగిస్తుందని కూడా ఈ సందర్భంగా ఆకాశ్ తెలిపారు.