ఆకాశం నుంచి ఊడిపడ్డ పెళ్లి కొడుకు (వీడియో) - MicTv.in - Telugu News
mictv telugu

ఆకాశం నుంచి ఊడిపడ్డ పెళ్లి కొడుకు (వీడియో)

November 28, 2019

akash yadav Skydives To His Wedding As Baraatis Cheer.

జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ధి అంటారు. కాబోయే వరుడి కోసం వధువులు నానా కలలూ కంటుంటారు. రెక్కల గుర్రంపై దూసుకొచ్చే కండల వీరులను కలగంటుంటారు. అబ్బాయిలు కూడా తక్కువేం కాదు. జలకన్యలను, వనకన్యలను మోహిస్తుంటారు. కొందరు విపరీతంగానూ ప్రవర్తిస్తుంటారు. ఇటీవల ఓ పెళ్లి కూతురు మండపం వద్దకు శవపేటికలో వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ పెళ్లి కొడుకు నింగిలోంచి ఊడిపడ్డాడు. 

 

 

View this post on Instagram

 

Hardrock Hotel, Cabo San Lucas #skysquared2019 Akaash the groom coming from the sky!

A post shared by Norma Shiheiber (@normashiheiber) on


ఆకాష్ యాదవ్ అనే నటుడి వివాహం మెక్సికోలో లాస్ కాబోస్‌లోని హార్డ్ రాక్ హోటల్‌లో జరిగింది. 

ఆ పెళ్ళిలో ఆకాష్ ఆకాశం నుంచి స్కై డైవింగ్ చేస్తూ  ఊడి పడ్డాడు. దీంతో పెళ్ళికి వచ్చిన బంధుమిత్రులు షాకయ్యారు. ఈ సంఘటనను జోహైబ్ అలీ అనే వ్యక్తి వీడియో తీసాడు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆకాష్ పెళ్ళికి ఇచ్చిన గ్రాండ్ ఎంట్రీ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీనికి సంబందించిన వీడియోను లక్షల్లో నెటిజన్లు వీక్షిస్తున్నారు. ఈ వీడియో చిత్రీకరించడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చిందని తెలిపాడు.