Akasha Veedhullo movie to be released on September 2
mictv telugu

ఇన్‌స్టాలో నన్ను బూతులు తిట్టండి.. కొత్త హీరో బంపర్ ఆఫర్

August 31, 2022

సినిమాలంటే ఫ్యాషన్‌తో కొత్త హీరోలు చాలా మంది పరిశ్రమకు వస్తుంటారు. కొంతమంది అయితే కథలు రాసుకొని దర్శకత్వం, హీరోగా విభిన్న పాత్రలు పోషిస్తుంటారు. ఈ రకంగా మల్టీటాలెంట్‌తో వచ్చిన కొత్త వ్యక్తి గౌతమ్ కృష్ణ. ఆకాశ వీధుల్లో అనే సినిమాతో ప్రేక్షకుల ముందు సెప్టెంబర్ 2న రానున్నాడు. పైగా నిర్మాత కూడా ఆయనే. ఈ సందర్భంగా మంగళవారం ప్రిరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, గౌతమ్ మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘పవన్ కల్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మా చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. ఆయనను మా ఫంక్షన్‌కి పిలిచే రేంజ్ మాకు లేదు. మాకు ఎలాంటి బ్యాగ్రౌండ్ లేదు. ఇండస్ట్రీలో తొక్కేస్తారని చాలా మంది భయపెట్టారు. కానీ, ఆర్టిస్టుగా ప్రూవ్ చేసుకోవాలనే కోరికతో ఈ చిత్రం నిర్మించాను. ఇది కేవలం యూత్ కోసమే తీసిన సినిమా. స్లోగా మైండ్‌కి ఎక్కుతుంది. మీరు నాకు ఒక్క ఛాన్సివ్వండి. సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా నాకు బాధలేదు. ఎవరికైనా ఈ సినిమా నచ్చలేదంటే నన్ను సోషల్ మీడియాలో బండబూతులు తిట్టండి. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తీశా’నని తెలిపారు.