హలో పెళ్లిసందడిపై ఓ లుక్కేయండి.. - MicTv.in - Telugu News
mictv telugu

హలో పెళ్లిసందడిపై ఓ లుక్కేయండి..

December 6, 2017

అక్కినేని అఖిల్ రెండో మూవీ ‘హలో’ షూటింగ్, స్టోరీ వంటి వాటిని రహస్యంగా పెట్టిన టీమ్ ఇప్పుడు పట్టు కాస్త సడలించింది. ప్రేక్షులను ఆకట్టుకోవడానికి యత్నాలు చేస్తోంది. తాజాగా ఈ సినిమాలోని వెడ్డింగ్ డ్యాన్స్ పాటను రిలీజ్ చేశారు. అఖిల్ ఎప్పటిలాగే క్యూటుగా కనిపించాడు. నాయిక కల్యాణి ప్రియదర్శన్ కూడా మస్తు అందచందాలతో కట్టిపడేస్తోంది. అఖిల్ ధోవతీ ధరించి చిందేస్తున్నాడు.

ఈ పాట గురించి అఖిల్ నిన్ననే సంకేతాలు ఇచ్చాడు ‘ఇప్పుడే ‘హలో’ ఆడియో ఫైనల్ మిక్స్ విన్నాను! మీకు కూడా ఆ సాంగ్స్ అన్నీ వినిపించాలని నాకు చాలా ఎగ్సైటింగ్‌గా ఉంది. నేను ఆగలేకపోతున్నానుజజ కాబట్టి రేపు నేను మీకోసం ఒకటి లాంచ్ చేయబోతున్నాను” అని ట్వీటాడు. చెప్పినట్టుగానే ఈరోజు సాంగ్‌ను వదిలాడు.

అఖిల్ మొదటి సినిమా ‘అఖిల్’ ప్లాప్ కావడంతో అఖిల్, నాగార్జున, అక్కినేని కుటుంబమంతా హలోను ఎట్లాగైనా హిట్ చేయాలని కంకణం కట్టుకుంది. నాగ్ అయితే రేయింబవళ్లు దీని గురించే పనిచేస్తున్నట్టు వినికిడి. అక్కినేని నటవారసత్వాన్ని కొనసాగించడానికి దేనికైనా సిద్ధమన్నట్లు యత్నిస్తున్నట్లు తెలుస్తోంది.