అఖిల్ సినిమాకు ఈమే హీరోయిన్ ! - MicTv.in - Telugu News
mictv telugu

అఖిల్ సినిమాకు ఈమే హీరోయిన్ !

July 11, 2017

తన డెబ్యూ మూవీ ‘ అఖిల్ ’ ఘోర పరాజయంతో అఖిల్ అక్కినేని ఫ్యూచర్ ను చాలా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు నాగార్జున. ‘ మనం ’ వంటి గొప్ప సినిమాను అందించిన విక్రమ్ కె కుమార్ చేతిలో పెట్టాడు కొడుకును. విక్రమ్ కె కుమార్ విజువల్ ట్రీట్ చాలా డిఫరెంటుగా వుంటుందనేది అందరికీ ఎరుకున్న ముచ్చటనే. అయితే షూటింగ్ షెడ్యూల్ ను మొదలు పెట్టిన ఇందులో హీరోయిన్ ఎవరనే దానికి తెర పడింది. ఈ సినిమా ద్వారా కళ్యాణి అనే కొత్త అమ్మాయి హీరోయిన్ గా పరిచయమౌతోంది. ఈమె ప్రముఖ దర్శకుడు ప్రియదర్శన్, నటి లిజిల కుమార్తె అయినటువంటి కళ్యాణి అఖిల్ అక్కినేని పక్కన స్టెప్పులెయ్యనుంది. తండ్రి దర్శకుడు, తల్లి నటి అవడంతో కళ్యాణికి ఇద్దరి లక్షణాలు మెండుగా వుంటాయి. సో ఈ సినిమాకు కలిసొచ్చే అంశం హీరోయినే అనేది ఇప్పుడు వినిపిస్తున్న మాట.