అఖిల్ సినిమా స్టిల్ లీక్.. - MicTv.in - Telugu News
mictv telugu

అఖిల్ సినిమా స్టిల్ లీక్..

August 19, 2017

‘అఖిల్’ మూవీతో ఏంట్రి ఇచ్చిన అక్కినేని వారసుడు అఖిల్ కు ఆ సినిమా ఆశించిన స్థాయిలో  విజయాన్ని అందించలేకపోయింది. ఇప్పుడు అఖిల్ ‘మనం’  సినిమా విక్రమ్ కుమార్ కె దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. ఈ సినిమాను అన్నపూర్ణ బ్యానర్ పై నాగర్జున నిర్మిస్తున్నారు. షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీకి సంబందించిన ఓ స్టిల్ సోషల్ మీడియోలో లీకైంది. అయితే దీనిపై నాగార్జున పెద్దంగా బెంబేలెత్తిపోలేదు. పైగా మరింత పెద్ద లీక్ ఇస్తామని చెప్పారు. ‘లీకైతే ఏమైంది. అంతకంటే పెద్దది,  ఒరిజినల్ స్టిల్ను
ఈ నెల   21 విడుదల చేస్తాం. ఇందుకు సంబందించిన క్లూస్ రేపు ఇస్తాం’  అని నాగార్జున ట్వీట్ చేశారు.

దీనిపై అఖిల్ స్పందిస్తూ ’స్టిల్.. ఎప్పుడు ఎలా లీకైందో తెలియదు. మీ  నుంచి మేమేమీ దాచలేం నమ్మండి . ఇంతకన్నా పెద్దది మెరుగైంది ఆగస్టు 21న వస్తుంది’ అని ట్వీట్ చేశాడు. లీకైన ఈ స్టిల్ లో అఖిల్ ఒక వైపు ఫైట్ చేస్తూ మరో వైపు రొమాన్స్ చేస్తూ ఉన్నాడు. ఈ మూవీలో అఖిల్ తో కళ్యాణి ప్రియదర్శిని జోడి కట్టన్నట్లు సమాచారం. ఈ మూవీకి ‘ఎక్కడ ఎక్కడ వుందో తారక’ టైటిట్ ను పెట్టనున్నారట చిత్ర యూనిట్. ఈ సినిమాను డిసెంబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకుకొస్తామని చిత్రబృందం చెబుతోంది.